Telangana: నీళ్లనుకుని కెమికల్ ఇచ్చిన తల్లి.. కొడుకు మృతి

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో జ్వరంతో బాధపడుతున్న కొడుకుకి తల్లి మాత్ర ఇచ్చింది. ఆ తర్వాత తాగు నీళ్లనుకొని పొరపడి ప్రమాదకర రసాయనాన్ని ఇచ్చింది. అది తాగడంతో కొడుకు వెంటనే మృతి చెందడం కలకలం రేపింది.

New Update
A boy-died-after-mistakenly-drinking-a-chemical in nalgonda district

A boy-died-after-mistakenly-drinking-a-chemical in nalgonda district

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో జ్వరంతో బాధపడుతున్న కొడుకుకి తల్లి మాత్ర ఇచ్చింది. ఆ తర్వాత తాగు నీళ్లనుకొని పొరపడి ప్రమాదకర రసాయనాన్ని ఇచ్చింది. అది తాగడంతో కొడుకు వెంటనే మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని అనుముల మండలంలో చిన్న అనుముల గ్రామానికి చెందిన  సత్యనారాయణ-రామలింగమ్మ దంపతులకు కొడుకు, కూతురు సంతానం. కొడుకు గణేష్ (19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. 

Also Read: మందుతాగితే ఇంగ్లీష్‌ అనర్ఘలంగా ఎందుకు మాట్లాడుతారో తెలుసా? విషయం తెలిస్తే షాకవుతారు..

రెండ్రోజులుగా జ్వరం రావడంతో అతడిని ఇంటికి తీసుకొచ్చారు. శనివారం ఉదయం మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. జ్వరం తీవ్రం కావడంతో పారసిటమాల్ ట్యాబ్లెట్ వేయాలని వైద్య సిబ్బంది చెప్పారు. దీంతో కొడుకుకి మాత్ర ఇచ్చిన తల్లి నీళ్ల కోసం చూడగా దగ్గర్లో కనిపించలేదు. దీంతో పక్కనే ఉన్న ల్యాబులోకి వెళ్లింది. అక్కడ ఓ క్యానులో ఉన్న ఫార్మాల్డిబైడ్‌ కెమికల్‌ను తాగునీరు అనుకుని బాటిల్‌లో నింపి కొడుకుకి తాగించింది. 

Also Read: సికింద్రాబాద్‌లో ‘స్మార్ట్‌’ సౌకర్యాలు..ఇక మీదట వర్క్‌ ఫ్రం రైల్వే స్టేషన్‌

రెండు గుటకలు తాగిన తర్వాత గణేష్ తీవ్ర అస్వస్థకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రి వద్ద తాగునీరు ఉంచకపోవడం, ప్రమాదకర కెమికల్‌ను అక్కడే నిర్లక్ష్యంగా వదిలేయడంతో గణేష్ మృతి చెందాడని బంధువులు ఆందోళన చేపట్టారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

Advertisment
తాజా కథనాలు