సెక్రటేరియట్లో అడుగడుగున పొంచిఉన్న ప్రమాదం..!
తెలంగాణ సెక్రటేరియట్లో రైలింగ్ పట్టి కూలి 24 గంటలైనా అధికారులు నివేదిక ఇవ్వకపోవడంపై R&B ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ సీరియస్ అయ్యారు. శుక్రవారంలోగా బిల్డింగ్ నిర్మాణంలో లోపాలు, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో రిపోర్ట్ ఇవ్వాలని ఇంజనీర్లను ఆయన ఆదేశించారు.