/rtv/media/media_files/2025/06/07/M4A2bKupcBJGOlELspWX.jpg)
Ex Councillor Romance In OYO Room
OYO Rooms : రాజకీయ నాయకులు అనగానే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. పార్టీ ఏదైనా పార్టీ కార్యకర్తలను సొంతవారికంటే ఎక్కువగా చూసుకోవాలి. ముఖ్యంగా కిందిస్థాయి క్యాడర్‌కు నాయకుడు అంటే మనోడు అనేలా ఉండాలి. అయితే రోజులు మారాయి. చాలామంది లీడర్లు కాలు జారుతున్నారు. అదే పార్టీలోని మహిళలతో అక్రమ సంబంధాలు నెరపడం, లేదా ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం చేస్తున్నారు. అది ఎప్పుడో ఒకసారి బయటకు రాకమానదు. అలా ఒకసారి దొరికితే ఇక కెరీర్ నాశనం అయినట్టే. పరువు పోవడంతో పాటు పవర్‌లో ఉన్నా ఎవరు దేకరు.అలాంటిదే మహబాబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
Also Read : తప్పు చేశావ్ కోహ్లీ.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
మహబాబాబాద్ జిల్లాకు చెందిన ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాజీ కౌన్సిలర్ కూడా అయిన గోగుల రాజు మరో మాజీ కౌన్సిలర్ తో ఓయో రూంలో దొరికిన సంఘటన కలకలం సృష్టించింది. గోగుల రాజు ఒక రాజకీయ పార్టీకి జిల్లా అర్బన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అతని భార్య కూడా 28వ వార్డుకు కౌన్సిలర్‌గా పనిచేసింది. అయితే రాజు ఇటీవల మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఆమెతోనే ఎక్కువగా తిరుగుతున్నాడు. దీంతో భార్య భర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. ఇదిలా ఉండగానే శుక్రవారం రోజున ఆమె కోసం ఓయో రూమ్ బుక్ చేసుకున్నాడు. అక్కడ ఇద్దరూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో విషయం తెలుసుకున్న భార్య ఎంటరైంది. తన బంధువులు, మిత్రులతో కలిసి ఓయో రూమ్ గది తలుపు తట్టింది. రాజు తలుపు తీయగానే సీన్ రివర్స్ అయింది.
Also Read : ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ చీఫ్ మహేష్ సంచలన ప్రకటన!
ఓయో రూములో యువతితో రాసలీలల్లో మునిగిన గోగుల రాజును భార్య అనురాధ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తనను పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ మరో మహిళతో ఎంజాయ్ చేస్తావా అంటూ గళ్లపట్టి చితకబాదింది. ఆమెతో పాటు వచ్చిన వాళ్లంతా ఆ ఇద్దరినీ చితక్కోట్టడంతో ఓళ్లు హునం అయింది. అయినా వదల కుండా కొట్టడంతో పాటు ఇద్దరినీ గదిలోనే ఉంచి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వస్తే మరింత పరువు పోతుందని బయపడిన రాజు వారి నుంచి విడిపించుకుని పారిపోయాడు. మాజీ కౌన్సిలర్ అనురాధ ఫిర్యాదు మేరకు.. గోగుల రాజు పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. రాజు కోసం గాలిస్తున్నారు.
Also Read : రిటైర్మెంట్ ప్రకటించిన మరో భారత క్రికెటర్
Also Read : సైలెంట్ గా ఓటీటీలోకి 'సింగిల్' ఎంట్రీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే
Follow Us