Arrest Virat Kohli: తప్పు చేశావ్ కోహ్లీ.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

ట్విట్టర్ (ఎక్స్) లో #ArrestKohli అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. కోహ్లీని అరెస్టు చేయాలని నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత కోహ్లీ కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించలేదని విమర్శిస్తున్నారు.

New Update
kohli arrest hashtag trending on social media after stampede rcb event

kohli arrest hashtag trending on social media after stampede rcb event

ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత ట్రోఫీ గెలిచింది. కానీ ఆ ఆనందం ఎంత సమయం ఉండలేదు. కనీసం 18 గంటలు ముగియక ముందే విషాదంగా, వివాస్పదంగా మారింది. ట్రోఫీ గెలిచిన ఆనందంలో ‘ఆర్సీబీ విక్టరీ పరేడ్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆనందోత్సవ కార్యక్రమం కాస్త విషాదంగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభిమానులు, క్రికెట్ ప్రియులు వేల సంఖ్యలో తరలివెళ్లారు. 

#ArrestKohli

దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకూ విరాట్ పై సోషల్ మీడియాలో వ్యతిరేకత పెరుగుతోంది. 

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

https://x.com/McGurk_Tristan/status/1930629257845481926

ట్విట్టర్ (ఎక్స్) లో #ArrestKohli అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుండటం గమనార్హం. చాలా మంది నెటిజన్లు కోహ్లీని అరెస్టు చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఈ తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత కోహ్లీ కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించలేదని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఘటన జరిగాక అతడు తన భార్యతో లండన్ వెళ్లి సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 

మ్యాచ్ గెలిచినపుడు భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న విరాట్ కోహ్లీ.. ఇప్పుడు తన అభిమానులు చనిపోతే కనీసం స్పందించలేదని విమర్శలు గుప్పిస్తు్న్నారు. మరికొందరేమో కోహ్లీకి బాధ్యత ఉందని.. ఈ విజయోత్సవ వేడుకకు ముఖ్య కారణం అతడేనని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ‘అరెస్ట్ విరాట్ కోహ్లీ’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడంతో కోహ్లీ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. కాగా ఇంకా ఈ వివాదం ముదిరే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. 

Also Read :  వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు

 

Bengaluru Stampede | Bengaluru Stampede - Arrest Kohli

Advertisment