TGSRTC: తెలంగాణ ఆర్టీసీ బంఫర్‌ ఆఫర్‌.. బస్సు ఎక్కితే చాలు..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులతోపాటు ఆదాయాన్ని పెంచుకోవాలని బంఫర్‌ ఆఫర్‌ పెట్టింది. అందులో భాగంగానే వృద్ధుల రాయితీ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారికి టికెట్‌పై రాయితీ ఇవ్వాలని నిర్ణయించుకుంది.

New Update
  TGSRTC Buses

TGSRTC Buses

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్సులలో వృద్ధులకు టికెట్‌పై రాయితీ కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయంపై సంస్థలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటకలలో వృద్ధులకు ఇప్పటికే ఈ తరహా రాయితీలు అమలులో ఉన్నాయి. వాటిని అధ్యయనం చేస్తూ.. టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు ప్రభుత్వం ముందు ఈ ప్రతిపాదనను ఉంచడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిపాదనను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు త్వరలో లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ రాయితీ పథకానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని ఆర్టీసీ కోరనున్నట్లు తెలుస్తోంది.

మహాలక్ష్మి పథకం.. తర్వాత మరో ముందడుగు:

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం.. ఆర్టీసీ సంయుక్తంగా మహాలక్ష్మి పథకాన్ని(Mahalakshmi Scheme) విజయవంతంగా అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద రోజుకు 34 లక్షల మందికిపైగా మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకం ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు మాత్రమే పరిమితం. వృద్ధులకు ఇచ్చే రాయితీని అన్ని రకాల బస్సులకు వర్తింపజేయాలని ఆర్టీసీ భావిస్తోంది. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ ఆదాయంపై కొంత ప్రభావం పడింది. టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతున్నందున.. డీజిల్, జీతాలు వంటి ఖర్చులకు కొంత ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: తెలంగాణ రైతులకు శుభవార్త.. కొత్త పాస్‌బుక్ వచ్చిన వారందరికీ ఈ నెలలో రైతు బీమా

ఈ నేపథ్యంలో ప్రయాణికులను పెంచుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ఆర్టీసీ ఆలోచిస్తోంది. అందులో భాగంగానే వృద్ధుల రాయితీ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 60 ఏళ్లు పైబడిన వారికి టికెట్‌పై 25 శాతం రాయితీ ఇస్తున్నారు. టీజీఎస్‌ఆర్టీసీలో ప్రస్తుతం రోజుకు సగటున 57 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వృద్ధులకు రాయితీ అమలుచేస్తే ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు ఆశిస్తున్నారు. ఇది సంస్థ ఆర్థిక పరిస్థితికి కొంత ఊరటనిస్తుందని వారు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే వృద్ధులకు పెద్ద ఉపశమనం లభించనుంది.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ సొంత జిల్లాలో బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ ఐదుగురు నేతలు జంప్?

Advertisment
తాజా కథనాలు