టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని పేర్కొంది. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా ఖాళీ ప్రకారం నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్‌లో కసరత్తు చేస్తామని పేర్కొంది. కొత్త నోటిఫికేషన్లు ఇచ్చాక 6 నుంచి 8 నెలల్లోనే భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని కమిషన్ స్పష్టం చేసింది. Also Read: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్.. మందుబాబులకు బిగ్ షాక్! అలాగే బుధవారం గ్రూప్ -3 'కీ' ని అలాగే మరో రెండు రోజుల్లో గ్రూప్-2 'కీ'ని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఇదిలాఉండగా.. తాము షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వచ్చేందుకు కృషి చేస్తున్నామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. జనవరి 11, 12 తేదీల్లో బెంగళూరులోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సదస్సు ఉంటుందని చెప్పారు. అలాగే ఉద్యోగ పరీక్షల విధానాలపై కూడా సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు. Also read: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త ఇదిలాఉండగా డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. అలాగే నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్ష జరిగింది. ఈ రెండు పరీక్షల 'కీ'ల విడుదల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఫలితాలు కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు! Also Read: అలా చేయడం లైంగిక వేధింపుతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు