/rtv/media/media_files/2025/08/16/nia-2025-08-16-10-55-01.jpg)
nia -Nizamabad Terrorist
Nizamabad Terrorist : నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. స్థానికంగా ఉగ్రవాది ఉంటున్నట్లు సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసులు దాడిచేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు అనుమానిత ఉగ్రవాది బోధన్ పట్టణంలో ఉంటున్నట్లు తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు, ఎన్‌ఐఏ,పాటియాలా పోలీసులతో పాటు స్థానిక పోలీసుల సహకారంతో బోధన్ పట్టణంలో బుధవారం తెల్లవారు జామున విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫా ఎమన్(హషన్ డ్యానిష్ )ను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: ముసలోడు కాదు...మూర్ఖుడు..11 ఏళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం
ఉగ్రవాదిగా అనుమానిస్తున్న వ్యక్తి పట్టణంలోని అనీసనగర్‌కు చెందిన డ్యానిష్ గా పోలీసులు గుర్తించారు. అతడి నుంచి ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. డ్యానిష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు కీలక విషయాలు బయటపడ్డాయని పోలీసులు వెల్లడించారు. ఆయనను బోధన్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పీటీ వారెంట్‌పై ఢిల్లీకి తరలించారు.
ఇది కూడా చదవండి:KTR కు ఏసీబీ బిగ్ షాక్..ఫార్ములా ఈ కార్ రేసులో అరెస్ట్ ?
ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎన్‌ఐఏ, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా పెంచాయి. ఈ క్రమంలో ఝార్ఖండ్‌లోని రాంచిలో బాంబు బ్లాస్టింగ్‌కు కుట్రలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు.దీనికి కుట్ర పన్నుతున్న హషన్ డ్యానిష్ ను అరెస్ట్ చేసినట్లు తెలసింది. డ్యానిష్‌కు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోని బోధన్ పట్టణంలో ఎన్‌ఐఏ అధికారులు జల్లెడ పట్టాయి. పక్కా సమాచారం మేరకు ఉగ్ర మూలాలు కలిగిన వ్యక్తిని అరెస్టు చేశాయి. మరింత సమాచారం కోసం అతడిని విచారించాల్సి ఉందని ఢిల్లీ నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. అయితే.. బోధన్‌లో డ్యానిష్ ఒక్కడే ఉన్నడా..? డ్యానిష్ ఒక్కడే ఉంటే తనకి చేతికి తుపాకీ ఎలా వచ్చింది...? ఝార్ఖండ్‌లాగానే.. తెలంగాణలో కూడా ఏమైనా బాంబు బ్లాస్టింగ్ ప్లాన్ చేశాడా..? రాష్ట్రంలో డ్యానిష్ లాంటి ఉగ్రవాదులు ఇంకా ఉన్నారా..? అనే సందేహాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.