Beer: ఒక వ్యక్తి ఎన్ని బీర్లు తాగొచ్చు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

భారత దేశంలో మద్యంప్రియులు ఎక్కువగా తాగే ఆల్కహాల్ డ్రింక్స్‌లో బీర్ దే అగ్రస్థానం. గోధుమలు, బార్లీ వంటి ధాన్యాలు పులియబెట్టి దీన్ని తయారు చేస్తారు. అయితే ఒక వ్యక్తి వారానికి ఎన్ని బీర్లు తాగొచ్చు..వైద్యులు, నిపుణులు ఏమంటున్నారు? ఒకసారి తెలుసుకుందాం.

New Update
FotoJet - 2026-01-19T124917.682

How many beers can a person drink?

Beer: సంక్రాంతి పండుగ ఇద్దరు యువకుల కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. ఇద్దరు యువకులు పోటీపడి అతిగా బీర్లు(chilled-beer) తాగడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది. చెన్నై, బెంగళూరులో పనిచేస్తున్న ఆవలకుంట మణికుమార్ (34), వేముల పుష్పరాజ్ (26) పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీ సమయంలో మణికుమార్, పుష్పరాజ్ ఇద్దరూ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పోటీపడి మొత్తం 19 బీర్లు తాగారు(drinking-beer). అధికంగా మద్యం సేవించడంతో వారు డీహైడ్రేషన్‌కు(dehydration) గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మణికుమార్ మార్గమధ్యంలో మృతి చెందగా, పుష్పరాజ్ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ క్రమంలో అసలు ఒక వ్యక్తి ఎన్ని బీర్లు తాగగలడు అన్న చర్చ మొదలైంది.

Also Read: కోనసీమలో కోడి పందాల కల్చర్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా?.. ఈ విషయం తెలిస్తే చప్పట్లు కొడతారు!

FotoJet - 2026-01-19T124901.567

వైద్యనిపుణులు ఏమంటున్నారంటే?

భారత దేశంలో మద్యంప్రియులు ఎక్కువగా తాగే ఆల్కహాల్ డ్రింక్స్‌(heavy drinking) లో బీర్ దే అగ్రస్థానం. గోధుమలు, బార్లీ వంటి ధాన్యాలు పులియబెట్టి దీన్ని తయారు చేస్తారు. ఇండియాలో ఎన్నో రకాల బ్రాండ్ల బీర్లు లభిస్తాయి. అయితే ఒక వ్యక్తి వారానికి ఎన్ని బీర్లు తాగొచ్చు..వైద్యులు, నిపుణులు ఏమంటున్నారు? ఒకసారి తెలుసుకుందాం.

ఈ ఆల్కహాలిక్ బేవరేజ్‌లో 4% నుంచి 6% వరకు ఆల్కహాల్ ఉంటుంది.బీర్ లిమిటెడ్‌గా తాగితే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కానీ అతిగా తాగితే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బీరు తాగేవారు దాని ప్రయోజనాలతో పాటు నష్టాల గురించి తెలుసుకోవడం అవసరం.  

Also Read: అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' షురూ.. ఈ 5 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) రిపోర్ట్ ప్రకారం.. ఒక వారంలో మగవారు అయినా, మహిళలైనా 14 యూనిట్లకు మించి మద్యం తాగకూడదంటున్నారు. ఇక్కడ యూనిట్ అంటే 10 మిల్లీలీటర్లు లేదా 8 గ్రాముల ప్యూర్ ఆల్కహాల్. ఉదాహరణకు 568 మిల్లీలీటర్ల సాధారణ బీర్‌ క్యాన్‌లో 5% ఆల్కహాల్ ఉంటుంది. అంటే అందులో సుమారు 3 యూనిట్ల ఆల్కహాల్ ఉన్నట్లు..అంటే ఒక వారంలో 6 రెగ్యులర్ బీర్‌ క్యాన్లు తాగితే 14 యూనిట్ల లిమిట్‌లో ఉంటారని గుర్తు పెట్టుకోవాలి. అంతకు మించి తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే రెగ్యులర్‌గా తాగేవారు ప్రతి వారంలో కనీసం రెండు రోజులు బ్రేక్ ఇవ్వడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇలా చేస్తే ఆల్కహాల్ ఎఫెక్ట్ నుంచి రికవర్ అయ్యేందుకు శరీరానికి తగినంత సమయం దొరుకుతుంది.

FotoJet - 2026-01-19T125036.165

బీర్‌లో ఉండే HDL లేదా మంచి కొలెస్ట్రాల్ గుండెకు మంచిది. ఇది ఎక్కువగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. ఈ ఆల్కహాల్ డ్రింక్‌లో కొద్ది మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చుతాయి. ఫలితంగా, ఆస్టియోపోరోసిస్ వ్యాధి ముప్పు తగ్గిస్తుంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్, బ్యాంక్ ఆఫర్స్ ఫుల్ డీటెయిల్స్ చూసేయండి!

న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ జర్నల్‌లో ప్రచురించిన ఓ పరిశోధనలో బీర్‌లో పాలిఫినాల్స్ అనే పదార్థాలు ఉంటాయని తేలింది. పాలిఫినాల్స్ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. మహిళలు రోజూ ఒక బీర్, పురుషులు రోజులో రెండు బీర్లు వరకు తాగితే గుండె జబ్బులు రావని ఆ పరిశోధన తేటతెల్లం చేసింది. ఈ డ్రింక్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే అతి అనర్థాలకు మూలం అంటారు. ఇది బీర్‌ విషయంలోనూ వర్తిస్తుంది. నిపుణులు చెప్పే లిమిట్ కంటే ఎక్కువ బీర్ తాగేస్తే కాలేయం, గుండెకు సంబంధించిన సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువ బీర్ తాగితే శరీరంలోని నీరు బయటకు పోతుంది. దీంతో డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి, నోరు ఎండిపోవడం, నీరసం వంటి సమస్యలు వస్తాయి. డీ హైడ్రేషన్‌ ఎక్కువైతే మనిషి శరీరలోని నీరంతా పోయి మరణం సంభవించే అవకాశం కూడా ఉంటుంది.

బీర్ తాగినప్పుడు మత్తు కారణంగా నిద్ర పడుతుంది. కానీ మత్తు దిగిన తర్వాత నిద్ర రాదు, అంటే స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. ఫలితంగా శరీరానికి తగినంత విశ్రాంతి దొరకదు. బీర్ కూడా ఒక ఆల్కహాలే అని, లైట్‌ లేదా మోడరైట్‌గా మద్యం తాగినా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే మద్యపానాన్ని పూర్తిగా మానేయడం మంచిది. ఆల్కహాల్ అలవాటైన వారు సేఫ్ లిమిట్స్‌కి మించి ఎప్పుడూ తాగకుండా జాగ్రత్త పడితే ఆరోగ్యానికి మంచిదని నిపుణలు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు