Tension At DGP's Office: డీజీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతల అరెస్ట్

హైదరాబాద్‌ నగర శివారులోని పోచారం ఐటీ కారిడార్‌లో గోసంరక్షణ కార్యకర్త సోనుసింగ్ అలియాస్ ప్రశాత్ సింగ్ పై  కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయమై  హిందూ సంఘాలతో పాటు బీజేపీ, బీజేవైఎం ఆందోళనకు దిగాయి.

New Update
Tension at DGP office.. BJP leaders arrested

Tension at DGP office.. BJP leaders arrested

హైదరాబాద్‌(hydrabad) నగర శివారులోని పోచారం ఐటీ కారిడార్‌లో గోసంరక్షణ కార్యకర్త సోనుసింగ్ అలియాస్ ప్రశాత్ సింగ్ పై  కాల్పుల ఘటన(Bajrang Dal About Pocharam Gun Fire) సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయమై  హిందూ సంఘాలతో పాటు బీజేపీ, బీజేవైఎం ఆందోళనకు దిగాయి. లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న జరిగిన సోనూ సింగ్ పై కాల్పులను నిరసిస్తూ ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పలువురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు. కాగా డీజీపీ ఆఫీసు ముట్టడికి దశలవారీగా వస్తున్న బీజేపీ సభ్యులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. కార్యాలయం వద్దకు వచ్చిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భాజపా నేతల ఆందోళనతో లక్డీకాపూల్‌, అసెంబ్లీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. వాహనాల రాకపోకలను పోలీసులు క్రమబద్ధీకరించారు. రవీంద్ర భారతి, అసెంబ్లీ ఏరియాల్లో భారీగా పోలీసులు మోహరించారు. 

Also Read :  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బ్యాలెట్తో ఓటింగ్?: ఎలక్షన్ ఆఫీసర్ కీలక ప్రకటన!

ప్రభుత్వం గుండాలను పోషిస్తోంది..రాంచందర్‌రావు

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు  పోచారంలో గోరక్షక్ కార్యకర్తపై ఎంఐఎం దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారని ఆరోపించారు. ఆ ఘటనను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని  ఆయన అన్నారు. ఇదే విషయమై తాము డీజీపీకి మెమోరాండం ఇవ్వడానికి వస్తే.. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ఎంఐఎం కార్యకర్తలు, గుండాలను పోషిస్తుందని రాంచందర్‌ రావు ఫైర్ అయ్యారు. వారిని బీజేపీ కార్యకర్తలు, గోరక్షక్ కార్యకర్తలపైకి ఉసిగొల్పుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. రేవంతుద్దీన్ సర్కార్ వచ్చిన నాటి నుంచి నగరంలో ఎంఐఎం ఆరాచకాలు, ఆగడాలు ఎక్కువయ్యాయని ఆయన ధ్వజమెత్తారు. పోలీసుల ఉదాసీన వైఖరితోనే ఇలాంటి ఘటనను చోటుచేసుకుందటున్నాయని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగదని రాంచందర్ రావు హెచ్చరించారు.

మా సహనం..పిరికితనం కాదు..బండి సంజయ్‌

హిందువుల సహనానికి హద్దు ఉందని మా సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఖబడ్దార్‌ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. మా దైవాన్ని, ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే గోవులను వధించేవారు మంచివారిగా గోరక్షకుడిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా పోచారం కాల్పుల ఘటన కేసులో పోలీసులు చెప్పిందంతా అబద్ధం అని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ప్రభుత్వమే పోలీసులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోందని బండి సంజయ్‌ అన్నారు. గోవధ చట్టాన్ని అమలు చేయడంలో పోలీసులు విఫలమైతే ఆ పని చేస్తున్న సోనూసింగ్‍పై పోలీసులే అభాండాలు మోపడం దుర్మార్గమన్నారు. కాగా కాల్పుల్లో గాయపడిన సోనూసింగ్‍ను ఇవాళ సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో రాజ్యసభ సభ్యులు డా.కె.లక్ష్మణ్, బీజేఎల్పీ ఉప నాయకుడు పాయల శంకర్, పార్టీ నేతలతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సోనూ సింగ్ వైద్యానికి అయ్యే ఖర్చును పార్టీ భరిస్తుందని, అతనికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

Also Read: గాల్లోనే ఇండిగో ఫ్లైట్ ఇంధన లీకేజీ.. గజగజ వణికిపోయిన 166 మంది ప్రయాణికులు

Advertisment
తాజా కథనాలు