Floods: తెలంగాణలో భారీ వర్షాలు.. 10 మంది మృతి: డీజీపీ అధికారిక ప్రకటన

కామారెడ్డి, మెదక్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నదులు, వాగులు పొంగడంతో జనావాసాల్లోకి వరదలు పోటెత్తాయి. దీనిపై డీజీపీ జితేందర్‌ స్పందించారు. ఈ వరదల ధాటికి ఇప్పటిదాకా 10 మంది చనిపోయినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు.

New Update
DGP jitender

DGP jitender

కామారెడ్డి, మెదక్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నదులు, వాగులు పొంగడంతో జనావాసాల్లోకి వరదలు పోటెత్తాయి. దీనిపై డీజీపీ జితేందర్‌ స్పందించారు. ఈ వరదల ధాటికి ఇప్పటిదాకా 10 మంది చనిపోయినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో సహాయక బృందాలు ఇప్పటికే పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వాళ్లని ఇప్పటిదాకా 2 వేల మందిని రక్షించామని పేర్కొన్నారు.  

Also Read: దేశంలో 20 ఫేక్ యూనివర్సిటీలు ... అవి కూడా నకిలీవే తెలుసా?

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సాయంతో రెండు హెలికాప్టర్లను వరద ప్రభావిత ప్రాంతాలను తీసుకొచ్చామన్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించామని తెలిపారు. మొత్తం రెండు వేల మంది సిబ్బందితో NDRF ఏర్పాటు చేశామని.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. SDRF, NDRF బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఓవైపు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ.. వరద బాధితులను రక్షించేందుకు పోలీస్ శాఖ పోరాడుతోందన్నారు.  

Also Read: హైదరాబాద్‌లో మరికాసేపట్లో భారీ వర్షం..ఎవరు బయటకు రావొద్దు..IMD హెచ్చరిక

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం డీజీపీ ఆఫీసులో కూడా అత్యవసర బృందాలు రెడీగా ఉంచామని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు వచ్చినా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలోని  కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వరదలు పోటేత్తాయి. అనేక చోట్ల జనజీవనం స్తంభించింది. చాలాప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. బీబీపేట నుంచి కామారెడ్డికి వెళ్లే దారిలో వరద ప్రవహానికి బ్రిడ్జి కొట్టుకుపోయింది. మరోవైపు క్యాసంపల్లి శివారులో వరదల ధాటికి జాతీయ రహదారి బైపాస్‌ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. పోచారం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద పొటేత్తింది. మరోవైపు నిజామాబాద్‌ వైపు కూడా రాకపోకలు ఆగిపోయాయి. 

Also Read: రాష్ట్రంలో కుంభవృష్టి.. సీఎం రేవంత్ ఏరియల్‌ పర్యటన

Also Read: కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పరిస్థితి ఘోరం VIDEO.. ఈరోజు మరో 2 జిల్లాల్లో డేంజర్‌

Advertisment
తాజా కథనాలు