/rtv/media/media_files/2025/08/28/university-grant-commission-2025-08-28-17-01-27.jpg)
University Grant Commission
UGC Fake Universities : నకిలీ వస్తువులు చూశాం. నకిలీ సర్టిఫికెట్లు చూశాం. కానీ ,ఏకంగా యూనివర్సిటీలే ఉన్నాయంటే నమ్ముతారా? కానీ, నిజం ఒకటి కాదు రెండు కాదు దేశ వ్యాప్తంగా 20 కి పైగా ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. వీటిల్లో ఏపీకి చెందిన 2 యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో అత్యధికంగా 8 ఫేక్ వర్సిటీలు ఉన్నట్లు తేలింది. అవే కాక యూపీలో నాలుగు, ఏపీ, బెంగాల్‌లో రెండేసి, మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్టు గుర్తించింది. ఈ యూనివర్సిటీలకు విద్యార్థులకు ఎలాంటి డిగ్రీలు మంజూరు చేసే అధికారం లేదని వెల్లడించింది. గుర్తింపు లేని, మోసపూరిత యూనివర్సిటీల ఉచ్చులో పడకుండా విద్యార్థులను రక్షించడమే తమ లక్ష్యమని UGC పేర్కొది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఈ యూనివర్సిటీల్లో నమోదు చేసుకునే ముందు ఆ విశ్వవిద్యాలయాలకు అక్రిడిటేషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలని సూచించారు.
ఫేక్ విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలను ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించే అవకాశం లేదని,.. ఆ డిగ్రీలు చెల్లుబాటు కావని UGC స్పష్టం చేసింది. ఈ యూనివర్సిటీలకు అసలు డిగ్రీలు ఇచ్చే అధికారమే లేదని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషీ తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కాకుమానివారితోటలో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ; విశాఖలోని బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియాను వంటివన్ని నకిలీవేనని యూజీసీ వెల్లడించింది.
"UGC చట్టంలోని నిబంధనలను కాదని దానికి విరుద్ధంగా ఇలాంటి నకిలీ యూనివర్సీటీలు డిగ్రీలు అందిస్తున్నట్లు UGC దృష్టికి వచ్చింది. అలాంటి నకిలీ విశ్వవిద్యాలయాలు ఇచ్చే డిగ్రీలు ఉన్నత విద్య లేదా ఉద్యోగ అవసరాలకు చెల్లుబాటు కావు. ఇవి విశ్వవిద్యాలయాలు కాదు. వీటికి డిగ్రీని ప్రదానం చేసే అధికారం లేదు’’ అని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
UGC విడుదల చేసిన నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా
ఏపీలోని గుంటూరు జిల్లా కాకుమానివారితోటలోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, విశాఖలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలను నకిలీవిగా యూజీసీ గుర్తించింది. పశ్చిమబెంగాల్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ సంస్థలను యూజీసీ నకిలీ వర్సిటీలుగా గుర్తించింది. అలాగే కర్ణాటకలోని బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, కేరళలో సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, మహారాష్ట్రలో రాజా అరబిక్ యూనివర్సిటీ, పుదుచ్చేరిలో శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు ఫేక్ అని యూజీసీ ప్రకటించింది. దిల్లీలో 8 ఫేక్ యూనివర్సిటీల జాబితాలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్, కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్- దర్యాగంజ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, వొకేషనల్ యూనివర్సిటీ, ఏడీఆర్ సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ ఉన్నాయని యూజీసీ పేర్కొంది. ఉత్తర ప్రదేశ్‌లో గాంధీ హిందీ విద్యాపీఠ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతితో పాటు , నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (Open University), భారతీయ శిక్షా పరిషత్ వంటివి నకిలీ యూనివర్సీటీలని తెలిపింది.
గత ఏడాది 21 ఫేక్ వర్సిటీలు
గతేడాది కూడా 21 యూనివర్సిటీలను నకిలీవిగా యూజీసీ గుర్తించింది. ఈ ఏడాది కూడా మరో 20 యూనివర్సిటీలను ఈ జాబితాలో చేర్చారు. UGC ప్రకారం, విశ్వవిద్యాలయాలు సెంట్రల్, స్టేట్/ప్రావిన్షియల్ చట్టం ప్రకారం స్థాపించబడినట్లయితే లేదా వాటిని డీమ్డ్-టు- -యూనివర్శిటీలుగా గుర్తించినట్లయితే మాత్రమే డిగ్రీలు మంజూరు చేయడానికి అధికారం కలిగి ఉంటాయి. పార్లమెంట్ చట్టం ద్వారా ప్రత్యేకంగా అధికారం పొందిన యూనివర్సీటీలు మాత్రమేవిద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేసే అధికారాన్ని కలిగి ఉంటాయి. డిగ్రీలు మంజూరు చేసే వర్సీటీలు విద్యా ప్రమాణాలను నిర్వహించడానికి, విద్యార్థులకు చట్టబద్ధమైన అర్హతలను అందించడానికి అవసరమైన చట్టపరమైన అధికారాన్ని కలిగి ఉంటాయని యూజీసీ తేల్చి చెప్పింది.
ఇది కూడా చదవండి:నర్సాపూర్ ట్రైన్‌లో భారీ దొంగతనం.. 68 గ్రాముల బంగారం చోరీ చేసిన దుండగులు!