New Update
/rtv/media/media_files/2025/08/28/cm-revanth-aerial-tour-2025-08-28-15-18-02.jpg)
CM Revanth's aerial tour
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు(heavy rain alert to telangana) కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గురువారం (ఆగస్టు 28) ఏరియల్ సర్వే చేయడానికి సిద్ధమయ్యారు. కొద్ది సేపటి కిందట ఆయన బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలు దేరారు. ఆయనతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాష్ట్రంలో వర్షాలపై జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రేవంత్ ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ, సహాయక చర్యలను వేగవంతం చేయడంలోనూ ఎటువంటి ఉదాసీనత ఉండకూడదని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. వర్షాలు(Telangana Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రిపగళ్ళు అని తేడా లేకుండా.. కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు జిల్లాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద చేరడంతో.. ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. వాగులు, నదులు పొంగిపోర్లుతున్నాయి. రహదారులపై భారీగా నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రవాణా సౌకర్యాలు దెబ్బతిన్నాయి. రోడ్లు జలమయం కావడంతో పాటు రైళ్లు కూడా రద్దు అయ్యాయి.
Also Read : కామారెడ్డి మునిగిపోవడానికి అసలు కారణం ఇదే!
Heavy Rains In Telangana
కాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి లతో నిన్న రాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితి సమీక్షించారు. గురువారం (ఆగస్టు 28) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముంపు గ్రామాలు, లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎస్ ఈ సందర్భంగా అధికారులకు ఆదేశించారు. వర్షాల వాళ్ళ దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరించేందుకు ప్రయత్నించాలని సూచించారు.
మెదక్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 30.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. హావేలిఘనాపూర్ మండలం సర్దనలో 30 సెంటీమీటర్ల కుండపోత వాన కురిసింది. నాగపూర్‌లో 27 సెం. మీ వర్షపాతం నమోదైంది. చేగుంటలో 22 సెం. మీ, రామయంపేట మండలాల్లో 20 సెం. మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ మేరకు మెదక్ నుంచి బోధన్, బాన్స్‌వాడ వైపు బస్సు సర్వీసులు నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. రామాయంపేట మండలంలో వర్షం ధాటికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. కాలనీలో చిక్కుకున్న ప్రజలను అధికారులు రక్షిస్తున్నారు.
మెదక్‌లో జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మెదక్, కామారెడ్డి(Flood Water in Kamareddy), సిరిసిల్లా, నిజామాబాద్ తదితర ముంపు ప్రాంతాలను, వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి.. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎదైనా సమస్య ఉంటే అధికారులుకు వెంటనే సమాచారం ఇవ్వాలని సీఎం సూచించారు.
తాజా కథనాలు