తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. సాయంత్రం 6 దాటగానే బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. అయితే మరో రెండ్రోజులు పాటు చలి గాలులు వీచే అవకాశం ఉందని తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. Also read: మహిళలకు గుడ్‌న్యూస్.. 10పాసైతే చాలు వేలల్లో ఆదాయం..కొత్త స్కీమ్ సూపర్? ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ శీతల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఎల్లుండి పలుచోట్ల తేలికపాటి నుంతి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా చెప్పింది. అల్పపీడన ప్రభావం నైరుతి బంగాళఖాతంలో కేంద్రీకృతమే ఉందని పేర్కొంది. Also read: 22 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌లో చిక్కుకున్న మహిళ.. ఎట్టకేలకు భారత్‌లోకి సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. అలాగే ఈ అల్పపీడనం రాగల 2 రోజుల్లో మరింత బలపడనుందని.. పశ్చిమ, వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు చలికి తట్టుకోలేకపోతున్నామంటూ పలువురు సోషల్ మీడియాలో తమ అనుభవాలు పంచుకుంటున్నారు. అయితే వృద్ధులు, చిన్న పిల్లలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. Also Read: నాకు మంత్రి పదవి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! Also Read: పబ్జీలో పరిచయం.. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.8లక్షలు నష్టం, చివరికి..!