మహిళలకు గుడ్‌న్యూస్.. 10పాసైతే చాలు వేలల్లో ఆదాయం..కొత్త స్కీమ్ సూపర్?

కేంద్ర ప్రభుత్వం ‘బీమా సఖి’ స్కీమ్ ప్రారంభించింది. దీని ద్వారా 10 పాసైన మహిళలు LIC ఏజెంట్లుగా పనిచేస్తారు. బీమా సంబంధిత పనులు నిర్వహిస్తారు. వీరు ప్రతి నెలా రూ. 7,000 నుంచి రూ. 21,000 వరకు అందుకుంటారు. వీరి వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.

New Update
bima sakhi

గ్రామాల్లో ఉండే చాలా మంది అమ్మాయిలు 10 లేదా ఇంటర్ వరకు చదివి ఇళ్లకే పరిమితం అవుతారు. ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోలేక చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఊర్లలో చిన్న చిన్న పనులకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. అలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ తీసుకొచ్చింది. దేశంలోని మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. 

అదే ‘బీమా సఖి యోజన’. ఈ పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఈ పథకం ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో ఏఏ ప్రయోజనాలు పొందొచ్చు.. ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది.. ఎంత డబ్బులు సంపాదించొచ్చు అనేది పూర్తిగా తెలుసుకుందాం. 

ఏంటీ బీమా సఖి పథకం 

బీమా సఖి పథకంలో భాగంగా మహిళలు బీమాకు సంబంధించిన కొన్ని పనులు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికోసం ఎంపికైన మహిళలకు ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. అనంతంరం మహిళలు LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) బీమా సఖిగా నియమించబడతారు. అంటే మహిళలు LIC ఏజెంట్లుగా ఉంటారు. ఈ పథకంలో చేరిన నుంచి బీమా సఖులు ప్రజలకు బీమా చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు ఎక్కువగా ప్రయోజనం పొందుతారు. 

డబ్బులు ఎంత ఇస్తారు? 

ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్

బీమా సఖి పథకంలో చేరిన సఖులకు డబ్బులు చెల్లిస్తారు. పథకం కింద ప్రతి నెల రూ.7,000 నుంచి రూ.21,000 వరకు అందిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ బీమా సఖి పథకం ప్రారంభంలో ఒక్కో మహిళకు ప్రతి నెల రూ.7,000 చెల్లిస్తారు. రెండో ఏడాదికి వచ్చేసరికి రూ.1000 తగ్గించి రూ.6000 ఇస్తారు. మూడో ఏడాదికి వచ్చేసరికి మరో రూ.1000 తగ్గించి రూ.5000 చెల్లిస్తారు. ఇది మాత్రమే కాకుండా మహిళలకు ప్రత్యేకంగా రూ.21,000 అందుతుంది. అదే సమయంలో బీమా లక్ష్యాలను పూర్తి చేసినవారికి స్పెషల్ కమీషన్ కూడా అందించబడుతుంది. 

2 లక్షల మందికి ఉపాధి కల్పన

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా మొత్తం మూడు సంవత్సరాలలో 2 లక్షల మందికి ఉపాది కల్పించాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో తొలి దశలో 35,000 మందిని బీమా ఏజెంట్లు తీసుకుంటారు. ఆ తర్వాత 50,000 మంది మహిళలను ఎంపిక చేస్తారు. ఇలా మొత్తం 2 లక్షల మందికి బీమా ఏజెంట్లు ఉపాధి కల్పిస్తారు. 

అర్హులు ఎవరు ?

ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా

బీమా సఖి పథకానికి 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులు. వీరు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి తెలుసుకోండి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు