Telangana: పోలీసింగ్‌లో నెంబర్‌ వన్‌గా తెలంగాణ..

తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌-2025’ పేరుతో టాటా ట్రస్ట్‌ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.

author-image
By B Aravind
New Update
Telangana Police

Telangana Police

తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌-2025’ పేరుతో టాటా ట్రస్ట్‌ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ప్రజలకు న్యాయం అందించే పోలీసులు, కోర్టులు, జైళ్లు, న్యాయసాయం లాంటి విభాగాల పనితీరును అధ్యయనం చేసిన టాటా ట్రస్ట్ 2019 నుంచి ర్యాంకింగ్‌ ఇస్తూ వస్తోంది. సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్ వెల్త్ హ్యూమన్‌ రైట్స్ ఇనిషియేటివ్ సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్‌వెల్త్‌ హ్యూమన్ రైట్స్‌ సంస్థల సహకారంతో తాజా రిపోర్టును తయారుచేసింది. 

Also Read: మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

Telangana Policing

ఇక వివరాల్లోకి వెళ్తే.. తాజాగా వెల్లడించిన నాలుగో ఎడిషన్ ర్యాంకుల్లో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. జ్యుడిషియరీలో 2, లీగల్‌ ఎయిడ్‌లో 10వ స్థానంలో 6.15 స్కోర్‌తో ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచింది. ఇక కర్ణాటక 6.78 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచింది. 2019లో విడుదలైన మొదటి ఎడిషన్‌లో తెలంగాణ ఓవరాల్‌ ర్యాంకుల్లో 11వ స్థానంలో ఉండేది. ఆ తర్వాత 2020, 2022లో మూడో స్థానాన్ని సాధించింది. ఈసారి కూడా అదే స్థానాన్ని సంపాదించింది. 

Also Read: కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?

కానిస్టేబుళ్ల స్థాయిలో చూసుకుంటే తెలంగాణ 13 శాతం మాత్రమే ఖాళీలు ఉన్నాయి. ఇది జాతీయ సగటు కంటే చాలా తక్కువ. తెలంగాణ పోలీసు శాఖలో 9 శాతం మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు. ఇది జాతీయ సగటు కంటే చాలా తక్కువ. ఇక్కడ మరో విషయం ఏంటంటే రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే ప్రతి 10.6 చదరపు కిలోమీటర్లకు.. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 282 చదరపు కిలోమీటర్లకు చొప్పున ఒక పోలీస్ స్టేషన్ ఉంది. చాలా తక్కువ పరిధిలో పోలీస్‌ స్టేషన్లు ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణనే మొదటి స్థానంలో నిలిచింది. 85 పోలీస్ స్టేషన్లలో సీసీ కమెరాలు, మహిళా డెస్కులు ఉన్నాయి. 

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

Also Read :  పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తా.. రాములమ్మ స్ట్రాంగ్ వార్నింగ్!

 

rtv-news | telangana-police | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు