Ponnam Prabhakar: ఉరేళ్ల వాళ్లకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి 6432 స్పెషల్ బస్సులు

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ 6432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నేటి నుంచి ఈ స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులకు అవసరమైతే ఆర్టీసీ మరిన్ని బస్సులు నడపడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

New Update
Telangana Minister Ponnam Prabhakar

Telangana Minister Ponnam Prabhakar

Ponnam Prabhakar: సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేవారి కోసం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ 6432 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు నేటి నుంచి నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు అవసరమైతే ఆర్టీసీ మరిన్ని బస్సులు నడపడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఆర్టీసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి మేజర్ బస్ స్టేషన్ వద్ద ప్రత్యేక అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. 

Also Read: నేనూ మనిషినే తప్పులు చేస్తాను దేవుడిని కాదు–ప్రధాని మోదీ

కఠిన చర్యలు

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా బస్సుల్లో అదనంగా మహిళలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎక్కడా ఇబ్బందులు కలిగించవద్దని అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి పండగ పూట ప్రయాణికులను అదనపు చార్జీల పేరుతో దోపిడికి గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Also Read: మహా కుంభమేళాకు రానున్న స్టీవ్‌జాబ్స్‌ భార్య

అదనంగా వసూలు చేస్తే

ప్రస్తుతం కొనసాగుతున్న చార్జీలనే వసూలు చేయాలని.. అదనంగా వసూలు చేస్తే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ చేస్తామని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అదనంగా వసూలు చేస్తే ప్రయాణికులు రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణికులకు సూచించారు. అధికారులు ఫీల్డ్ లోనే ఉండి.. నిరంతరం తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు.

Also Read: తగలబడుతున్నHollywood.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా

బస్సులు సీజ్

ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించాలన్నారు. అదనపు చార్జీలు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే బస్సులు సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తమ ప్రభుత్వం ప్రయాణికుల భద్రత, సంక్షేమనికే ప్రాధానత్య కల్పిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ప్రయాణికులు పండగ సమయంలో జాగ్రత్తగా గమ్య స్థానాలకు వెళ్లాలని సూచించారు.

Also Read: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు