AGHORI: తన్నులు తిన్న అఘోరి.. ఆమె రాకపోతే చచ్చిపోతానంటూ రచ్చ రచ్చ!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న అఘోరిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఫిబ్రవరి 9న వర్షిణి అనే అమ్మాయి కోసం వెళ్లిన అఘోరిని రాజేష్‌నాథ్‌ చితకబాదిన వీడియో వైరల్ అవుతోంది. అఘోరి, వర్షిణి, రాజేష్‌నాథ్‌ ఈ ముగ్గురికి సంబంధించిన ఆడియో చర్చనీయాంశమైంది.

New Update

AGHORI: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న అఘోరిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఫిబ్రవరి 9న వర్షిణి అనే అమ్మాయి కోసం వెళ్లిన అఘోరిని ఓ రాజేష్‌నాథ్‌ చితకబాదిన వీడియో వైరల్ అవుతోంది. వర్షిణికి దీక్ష ఇచ్చినట్లు అఘోరీ చెప్పిన ఆడియో లీక్ కావడం చర్చనీయాంశమైంది. అయితే అతను చితకబాదుతున్నా అఘోరి సైలెంట్‌గా ఉండిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షిణి, అఘోరి, రాజేష్‌నాథ్‌కు మధ్య సంబంధంపై ఆరాతీస్తున్నారు. ఆడియో కాల్‌లో అఘోరీకి, అమ్మాయికి మధ్య సంభాషణ జరగగా.. తనను చూసేందుకు రాకపోతే చచ్చిపోతానంటూ అఘోరీని బెదిరింపులు గురిచేసింది వర్షిణి. ఈ వ్యవహారం మరోసారి రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతుండగా పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

ఆ యువతిని కూతురిలా..

తురెమెల్ల శ్రీవర్షిణి అనే ఒక యువతికి తాను దీక్ష ఇచ్చి.. సాధన నేర్పిస్తున్నానని తెలిపింది. ఆ యువతి జీవితాంతం తనతోనే ఉంటుందని పేర్కొంది. ఆమె బరువు బాధ్యతలు కూడా తానే తీసుకుంటున్నానని తెలిపింది. ఇలా చాలా మంది ఆడ పిల్లలు ఇప్పుడిప్పుడే తనవద్దకు వస్తున్నారని.. ఎవరైనా సరే ఇష్టపడి శిక్షణ నేర్చుకోవాలి అని అనుకుంటే.. భగవంతునికి సేవ చేసుకోవాలి అనుకుంటే తాను నేర్పిస్తానని తెలిపింది. తనను నమ్ముకుని వచ్చిన ఆడబిడ్డలను మంచి స్థితికి తీసుకుని వెళ్తానని చెప్పింది.  ఇక తనతో పాటు ఉన్న ఆడ బిడ్డను కూడా తనలాగే మహిళల కోసం పోరాడే వ్యక్తిలా తీర్చి దిద్దుతానని తెలిపింది.  

Also Read: కన్నడ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏడాదికి 27 దుబాయ్ ట్రిప్స్

ఆడ పిల్లలను ఆడ పులిలా..

ఒక రోజు ఆ యువతి తనకు కాల్ చేసిందని.. తన దగ్గర దీక్ష తీసుకుంటానని చెప్పడంతో పరిచయం అయిందని పేర్కొంది. ఇక ఇలాంటి ఆడపిల్లలకు మాత్రమే తాను సాధన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఆడ పిల్లలను ఆడ పులిలా తీర్చి దిద్దడమే తన ప్రధాన లక్ష్యం అని చెప్పుకొచ్చింది. ఇప్పటికే అఘోరీ వద్ద దీక్ష తీసుకున్నాను. ఇది నా ఒక్కదాని నిర్ణయం కాదు.. ఇంట్లో వాళ్లందరూ ఒప్పుకున్నాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక బీటెక్ స్టూడెంట్‌ని. ఇక నుంచి అఘీరీ అమ్మే అన్నీ చూసుకుంటానని చెప్పింది. సొంత కూతురిలా నన్ను చదివిస్తానని మాట ఇచ్చింది. ఆ నమ్మకంతోనే అఘోరీ అమ్మతో.. ఆమె బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నాను అని ఆ యువతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Also Read: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు