Nampally Court: ఐబొమ్మ రవికి మరో బిగ్ షాక్..

సినిమాలను పైరసీ చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడిపై కస్టడీకి పర్మిషన్ ఇస్తూ నాంప్లల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

New Update
Nampally Court grants permission for the custody of iBomma Ravi

Nampally Court grants permission for the custody of iBomma Ravi

సినిమాలను పైరసీ చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు రవి(iBomma Ravi)ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడిపై విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టు(nampally-court)ను కోరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడిపై కస్టడీకి పర్మిషన్ ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందుగా పోలీసులు రవీని ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణలో ఐబొమ్మ వెబ్‌సైట్‌కు సంబంధించి రవీ నుంచి పోలీసులు మరింత సమాచారం రాబట్టే ఛాన్స్ ఉంది.  

Also read: ఇండియాలో భారీ దాడులకు జైషే కుట్ర.. ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణ

IBomma Ravi Into Custody

కరేబియన్ దీవుల్లో ఉంటూ రవి పైరసీ వైబ్‌సైట్లయిన ఐబొమ్మ, బప్పం టీవీలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. కేవలం పైరసీ మాత్రమే కాకుండా ఏకంగా 10 దేశాల్లో దీనికి సంబంధించిన నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌తో వందల కోట్ల వరకు అక్రమ దందా నడిపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో భారీగా ఆర్థిక లావాదేవీలు జరగడంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తమకు ఇవ్వాలని హైదరాబాద్‌ పోలీసులను కోరింది. 

Also Read: శబరిమల ఆలయంలో అపశృతి.. ఆలయంలో భక్తురాలు మృతి!

రవి గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. జీతం సరిపోక, భార్య,అత్తమామలు చులకనగా మాట్లాడటంతో అతడు ఈ పైరసీ వెబ్‌సైట్‌ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులకు చెప్పాడు. గతంలో నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండో అంటూ పోలీసులకు కూడా సవాల్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశాడు. అయితే ఇటీవల అతడు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు రావడంతో పక్కా సమాచారంతో పోలీసులు అతడిని కూకట్‌పల్లిలో ఇంట్లో ఉండగా అరెస్టు చేశారు. ఇప్పటికే రవి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.3.5 కోట్లు స్తంభింపజేశారు. ఈ పైరసీకి సంబంధించిన నెట్‌వర్క్‌లో రవితో సహా పలువురు విదేశీయులు కూడా ఉన్నారని.. వాళ్లపై కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు