ఆత్మగౌరవం పోయాక పదవులు ఎందుకు.. ఈటల సంచలన కామెంట్స్!

ఆత్మగౌరవం కోల్పోయాక ఏ పదవి వచ్చినా గడ్డిపోచతో సమానమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉద్యమ సమయంలో పదవులను గడ్డిపోచల్లాగా విసిరేసిన చరిత్ర తమదన్నారు.

New Update
Eatala Rajender BJP

బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం కోల్పోయాక ఏ పదవి వచ్చినా గడ్డిపోచతో సమానమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవులను గడ్డిపోచల్లాగా విసిరేశామని గుర్తు చేశారు ఈటల. సాధారణంగా 20 ఏళ్లలో 4 సార్లు ఎమ్మెల్యే అవుతారన్నారు. కానీ తాను 7 సార్లు ఎమ్మెల్యే అయ్యానన్నారు. ఆత్మగౌరవం కోసం రాజీనామాల మీద రాజీనామాలు చేశామన్నారు. నేడు హైద‌రాబాద్‌ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం కాప్రాలో ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహా ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వతంత్రం ఎంతోమంది త్యాగఫలం అని మర్చిపోవద్దని అన్నారు. పిల్లలకు దేశభక్తి నేర్పించాలని పేరెంట్స్ కు సూచించారు.

దేశభక్తి, కమిట్మెంట్ లేకుంటే కష్టం అవుతుందన్నారు. పక్క దేశాల్లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూస్తున్నామన్నారు. భారత దేశంలో 140 కోట్ల జనాభా.. ఒక్కొకరిది ఒక్కో సంస్కృతి, సంప్రదాయమని అన్నారు. పిల్లలకు వారస్వత్వంగా అందిచాల్సింది కేవలం మన ఆస్తులు మాత్రమే కాదన్నారు. మన విలువలు సంప్రదాయాలు వారసత్వంగా అందించాలని సూచించారు. ఈరోజుల్లో వస్తున్న వార్తలు కలచి వేస్తున్నాయన్నారు.

కన్న తల్లిదండ్రులను పిల్లలను చంపుతున్నారని.. కొందరు భర్తలను చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నుండి కాపాడేది మన విలువలేనని అన్నారు. ఇవన్నీ ఎక్కడో జరుగుతున్నాయని పట్టించుకోకుండా ఉండొదన్నారు. అవి మన గడపలను కూడా తాకుతాయన్నారు. అందుకే పిల్లలను జాగ్రత్తగా పెంచాలని సూచించారు. అన్ని జీవుల్లో కెల్లా మానవ జీవితం గొప్పదన్నారు. 

Advertisment
తాజా కథనాలు