/rtv/media/media_files/2025/06/29/doctors-2025-06-29-20-05-13.jpg)
Doctors
తెలంగాణ వైద్య విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మెడికల్, డెంటల్ విద్యార్థుల స్టైఫండ్‌ను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనానికి కూడా వర్తిస్తుంది. ఈ పెంపు వల్ల ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792 స్టైఫండ్ లభించనుంది. అలాగే పీజీ డాక్టర్ల గౌరవ వేతనం కూడా గణనీయంగా పెరిగింది. పీజీ మొదటి సంవత్సరం వారికి నెలకు రూ.67,032, రెండో సంవత్సరం వారికి రూ.70,757, ఇక చివరి సంవత్సరం వారికి రూ.74,782 గౌరవ వేతనం అందనుంది. వైద్య విద్యార్థులకు ఈ స్టైఫండ్ వల్ల ఆర్థికంగా ఉపయోగపడుతుంది.
ఇది కూడా చూడండి: Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం
Stipend For Telangana Medico's
తెలంగాణలో మెడికోలకు భారీగా పెరిగిన స్టయిఫండ్.
— Telugu Stride (@TeluguStride) June 29, 2025
ఒకేసారి 15 శాతం పెంచుతూ జీవో జారీ చేసిన తెలంగాణ సర్కార్. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్‌తో పాటు, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం కూడా పెంచిన ప్రభుత్వం.#Telangana #RevanthReddy pic.twitter.com/TpW6QcAuGx
ఇది కూడా చూడండి: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!
మెడికోలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
— Tharun Reddy (@Tarunkethireddy) June 29, 2025
మెడికోలకు ఒకేసారి 15% స్టయిఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ
మెడికల్, డెంటల్ స్టూడెంట్స్‌తో పాటు సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం కూడా పెంపు
ఈ పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792
పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో రూ.67,032, సెకండ్ ఇయర్లో…
ఇది కూడా చూడండి: ENG W vs IND W: భారత్ ఘన విజయం.. స్మృతి మంధాన రికార్డు సెంచరీతో ఇంగ్లాండ్ చిత్తు చిత్తు
ఇది కూడా చూడండి: Vivo X200 FE: వివో నుంచి అరాచకమైన ఫోన్.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే - ఫీచర్లు హైలైట్!
jobs | hyderabad | medical | stipend