/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల(bc reservations) అంశంపై హైకోర్టు(telangana-high-court) సంచలన ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే విధించింది. జీవో నంబర్.9పై స్టే ఇచ్చింది. ఆరు వారాలకు తదుపరి విచారణను వాయిదా వేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై అభ్యంతరాలను దాఖలు చేయడానికి పిటిషన్లకు మరో రెండు వారాల సమయం ఇచ్చింది. అనంతరం 6 వారాల తర్వాత న్యాయస్థానం ఈ అంశంపై విచారణ చేయనుంది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రెడ్డి జాగృతి నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై సెప్టెంబర్ 27న హైకోర్టు విచారణ చేపట్టింది.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
— Volga Times (@Volganews_) October 9, 2025
బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే
బీసీలకు 42% రిజర్వేషన్లను జీవో నెంబర్ 9లో ఇచ్చిన ప్రభుత్వం
జీవో నెంబర్ 9పై స్టే విధించిన హైకోర్టు
ఈ జీవో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం
దీనిపై కౌంటర్… pic.twitter.com/FEvptMChNw
Also Read : ఎన్నికలపై హైకోర్టు స్టే.. రేవంత్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఇదే!
అనంతరం విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. నిన్న ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను నేటికి వాయిదా వేసింది. దీంతో మధ్యాహ్నం 2.30 గంటలకు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. బీసీ కులగణన చేయాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. మార్చిలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై గవర్నర్ కు ఆర్డినెన్స్ ను అందించామన్నారు. అది ఇంకా పెండిగ్ లోనే ఉందన్నారు. గడువు ముగియడంతో చట్టంగా మారినట్లే భావించాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్లపై పరిమితి లేదని మరో అడ్వకేట్ రవివర్మ వాదనలు వినిపించారు.
50 శాతం పరిమితికి మించొద్దని కూడా లేదన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. నిన్న పిటిషనర్ తరఫున లాయర్లు వాదనలు వినిపిస్తూ.. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమన్నారు. గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉన్న సమయంలో జీవో తీసుకురావడం సరికాదన్నారు.
Also Read : ఈటలను ఉద్దేశించి బండి సంజయ్ సంచలన కామెంట్స్!
రేవంత్ సర్కార్ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న రేవంత్(Revanth Reddy) సర్కార్ కు ఈ నిర్ణయం బిగ్ షాక్ గా మారింది. దీంతో నెక్ట్స్ ఏం చేయాలనే అంశంపై ఈ రోజు సాయంత్రం న్యాయనిపుణులతో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. కోర్టు నిర్ణయానికి సంబంధించిన పూర్తి ఉత్తర్వులు వెలువడ్డ తర్వాత పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల కమిషన్ సైతం కోర్డు ఆర్డర్ కు సంబంధించిన పూర్తి కాపీ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాచరణపై సాయంత్రంలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.