కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికల వేళ సొంత పార్టీ నాయకులకు ఆయన చురకలు అంటించారు. టిక్కెట్లు ప్రకటించేది రాష్ట్ర నాయకత్వమేనని తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు ఎలాంటి గ్రూపుల్లేవ్.. తనది బీజేపీ గ్రూప్ అని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకంటే నీచమైన వంచన ఇంకోటి ఉండదని చెప్పారు.
Also Read : ఎన్నికలపై హైకోర్టు స్టే.. రేవంత్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఇదే!
అన్ని విధాలా కృషి చేస్తా
పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పైస్థాయి నాయకులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఈ కామెంట్స్ చేశారు. తనను ఎంపీగా గెలిపించింది కార్యకర్తలేనని, స్థానిక సంస్థల్లో వాళ్లను గెలిపించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పారు.
కాగా ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఎంపీ ఈటల(etela rajender) పై ఆ జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు చేశారు. బీజేపీ టికెట్స్ ఇవ్వకపోతే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి టికెట్స్ ఇప్పిస్తానని హుజురాబాద్ లో ఈటల తన అనుచరుల వద్ద ప్రస్తావించినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈటలను ఉద్దేశించేనని ఓ వర్గం నేతలు అంటున్నారు. గత ఎన్నికల మాదిరిగానే గానే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బండి vs ఈటలగానే ఉండనున్నాయని కమలం శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వీరి మధ్య ఆధిపత్య పోరు పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం ఉందని మరోవర్గం నేతలు అంటున్నారు.
Also Read : CJI: 'షాక్ అయిపోయా'.. షూ దాడిపై తొలిసారిగా స్పందించిన సీజేఐ బీఆర్ గవాయ్
Bandi Sanjay : ఈటలను ఉద్దేశించి బండి సంజయ్ సంచలన కామెంట్స్!
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికల వేళ సొంత పార్టీ నాయకులకు ఆయన చురకలు అంటించారు. టిక్కెట్లు ప్రకటించేది రాష్ట్ర నాయకత్వమేనని తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.