/rtv/media/media_files/2025/09/09/tgpsc-group-1-2025-09-09-19-10-51.jpg)
గ్రూప్1పై తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పు ఇచ్చింది. గతంలో ప్రకటించిన గ్రూప్1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేసింది. మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేసి వీటి ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేదించింది. ఇది సాధ్యంకాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలన్న కోర్టు టీజీపీఎస్సీకి 8 నెలల గడుపును విధించింది. మొత్తంగా రీవాల్యుయేషన్ చేయాలి లేదా మళ్లీ పరీక్షలైనా నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు గ్రూప్- 1లో అవకతవకలను బలపరిచింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ నామావరపు రాజేశ్వరరావు ధర్మాసనం టీజీపీఎస్సీ కి ఆదేశించింది. ఈ ఏడాది మార్చు నెలలో టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. దీనిపై విచారించిన న్యాయస్థానం అభ్యర్థుల వాదనలతో ఏకీభవించింది. కోర్టు తీర్పు కోసం లక్షలాది మంది అభ్యర్థులు రెండు నెలల నుంచి ఎదిరి చూస్తున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పు అభ్యర్థులకు కొంతవరకు ఓదార్పునిచ్చినట్టైనది. మరి ఇప్పటికైనా ప్రతిభ గల విద్యార్థులకు న్యాయం జరుగుతుందా? అనేది వేచి చూడాలి. భవిష్యత్ నియామకాలపై కూడా దీని ప్రభావం ఉండనుంది.
Also Read : టీడీపీలోకి కవిత.. నారా లోకేష్ షాకింగ్ రియాక్షన్!
ఆది నుంచి అనుమానాలే..
గత సంవత్సరం అనగా.. 2024, అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. దాదాపు 21,000 పైచిలుకు అభ్యర్థులు గ్రూప్- 1 పరీక్ష(Group-1 Exam) రాసారు. ఇందులో 12,000 మంది అంటే 60 శాతం ఇంగ్లీష్ లో ఎగ్జామ్ రాసారు. ఎంపికైన వారిలో 90 శాతం ఆంగ్లంలో రాసిన విద్యార్థులే ఉన్నారు. అనగా 506 మందిని తెలుస్తుంది. తెలుగు మీడియంలో 8,000 మంది విద్యార్థులు అంటే 40 శాతం విద్యార్థులు పరీక్ష రాస్తే, కేవలం 10శాతంలోపే సెలెక్ట్ అయ్యారు. అనగా 56 మంది మాత్రమే. ఇక్కడ భాషా పరమైన వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుంది. ఉర్దూ మీడియం లో 9 మంది ఎగ్జామ్ రాసారు అంటే శాతం 0.1శాతం అనగా ఒకరు సెలెక్ట్ కావడం జరిగింది. ఈ గ్రూప్- 1 ఫలితాలను గమనిస్తే తెలుగు మీడియం వాళ్ళు చాలా నష్టపోయారని అర్ధమవుతుంది. దీంతో గ్రూప్- 1పరీక్ష ఫలితాలపై అభ్యర్థులు పలు అనుమానాలు లేవనెత్తారు. హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ తరపున అడ్వకేట్ రచన రెడ్డి వాదన మేరకు టీజీపీఎస్సీ గ్రూప్-1(tgpsc-group-1-exam) నియామకాలకు బ్రేక్ పడింది. మళ్లీ వరుసగా వాదనలు జరిగాయి. టీజీపీఎస్‌సీ తరఫున సీనియర్ కౌన్సెల్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గెలుపే లక్ష్యంగా వాదించారు. ప్రస్తుతం తెలుగు మీడియం విద్యార్థుల కర్మ, వారి పరిస్థితి అంతే అన్నట్టుగా మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేద మధ్యతరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేశారు. మరోవైపు గతంలో టీజీపీఎస్సీ అడ్వకేట్ ను జడ్జ్ గారు గ్రూప్- 1 మెయిన్స్ పేపర్లను దిద్దించే క్రమంలో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ వాళ్ళకి వేరే వేరే కీ ఇచ్చారా? అని అడినప్పుడు ఇవ్వలేదన్నారు. తరువాత వాదనలో కీ ఇచ్చామని చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే అసలు మూల్యాంకనం సరిగ్గా జరిగిందా? జరగలేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
గ్రూప్- 1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షలో సగటు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థికి వచ్చిన మార్కుల కన్నా ఎంతో విశ్లేషణాత్మకంగా రాసిన తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ రావడమే దీనికి నిదర్శనం. మరోవైపు కొన్ని పరీక్ష సెంటర్ల నుంచి మెజార్టీ అభ్యర్థులకు ఎంపికకావడం పలు అనుమానాలకు దారి తీసింది. గతంలో గ్రూప్ -1 నియామకాల్లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎంపికలో గతంలో జీవో 55 ను పక్కన పెట్టీ జీవో 29 తీసుకువచ్చారు. దీంతో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉల్లంఘన జరగడం వలన సామాజిక వర్గాల వారికి అన్యాయం జరిగింది. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా అన్యాయం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకెళ్లి మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. ఇది అభ్యర్ధులలో ఆందోళనలకు కారణమయినది.
Also Read : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఆ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన కవిత!
రీ మెయిన్స్ నిర్వహించడమే పరిష్కారం..
రాష్ట్రంలో గ్రూప్-1 సర్వీసును ఉన్నతమైన ఉద్యోగంగా భావిస్తారు. ఆ సర్వీస్ సాధించాలని నిరుద్యోగుల కల. గత ప్రభుత్వం హాయంలో దాదాపు 10 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ వేశారు. అప్పుడే జరిగిన అవకతవకల నేపథ్యంలో ఒకసారి గ్రూప్ - 1 ఫిలిమ్స్ పరీక్ష రద్దయినది. తర్వాత ప్రభుత్వం మారింది. మళ్ళీ నూతన నోటిఫికేషన్ తో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు మరోసారి హైకోర్టు గ్రూప్- 1 ఫలితాలు రద్దు చేసిన నేపథ్యంలో టీజీపీఎస్సీ పరీక్ష నిర్మాణంలో విశ్వసనీయత, అభ్యర్థులు పరీక్షల పట్ల నమ్మకాన్ని కోల్పోతుంది. ఇప్పుడు హైకోర్టు రీవాల్యుయేషన్, మరొకటి రీమెయిన్స్ గురించి చెప్పినది.
ఇందులో రీవాల్యుయేషన్ సాధ్యమయ్యే పరిస్థితి కనబడటం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనలలోని నియమం-3 (ix) (d) ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ రీవాల్యుయేషన్ లేదనీ చెప్పింది. ఈ నేపథ్యంలో తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించడమే సరైనదని నిపుణులు అంటున్నారు. అభ్యర్థుల సైతం పారదర్శకంగా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. టీజీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే అభ్యర్థులు ఆర్దికంగా చాలా నష్టపోయారు. భవిష్యత్ ప్రక్రియ ఎలాంటి అవకతవకలు లేకుండా జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఉద్యోగ నియామకాలపై నమ్మకం కలుగుతుంది.
సంపతి రమేష్ మహారాజ్
సామాజిక విశ్లేషకులు
7989579428