BIG BREAKING: టీడీపీలోకి కవిత.. నారా లోకేష్ షాకింగ్ రియాక్షన్!

కవితను టీడీపీలో చేర్చుకోవడం అంటే.. జగన్‌ను టీడీపీలో చేర్చుకోవడం లాంటిదేనంటూ నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. కవిత టీడీపీలో చేరే ఛాన్స్ ఉందన్న ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఈ అంశంపై నారా లోకేష్‌ స్పందించారు.

New Update
Nara Lokesh Kalvakuntla Kavitha

కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత టీడీపీలో చేరే ఛాన్స్ ఉందన్న ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఈ అంశంపై నారా లోకేష్‌ స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్‌ నేడు మీడియాతో చిట్ చాట్ చేశారు. కవితను టీడీపీలో చేర్చుకోవడం అంటే.. జగన్‌ను టీడీపీలో చేర్చుకోవడం లాంటిదేనంటూ సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్‌ను గతంలో చాలా సార్లు కలిశానన్నారు. కేటీఆర్‌ను కలిస్తే తప్పేంటి..? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు.

ఆ విషయంపై జగన్ నే అడగండి..

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి వైసీపీ సభ్యులు ఓటు వేయడంపై సైతం లోకేష్ స్పందించారు. ఆ అభ్యర్థికి ఓటు ఎందుకు వేశారో జగన్ ను అడగాలన్నారు. రానున్న 2029 ఎన్నికల్లో కూడా తాము మోదీకే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు. దేవాన్షు పొలిటికల్ ఎంట్రీపై జర్నీలిస్టులు అడిగిన ప్రశ్నలపై సైతం లోకేష్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. దేవాన్ష్‌ ఎందుకు రాజకీయాల్లో వస్తారు అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. అతను హ్యాపీగా చెస్ ఆడుకుంటున్నాడన్నారు. మరో సారి రెడ్ బుక్ పై లోకేష్ స్పందించారు. గత జగన్ ప్రభుత్వ హాయంలో చాలా స్కామ్ లు జరిగాయన్నారు. అవన్నీ బయటకి వస్తాయన్నారు. అందుకోసమే జగన్ బెంగుళూరులో ఉన్నాడని అన్నారు. తెలంగాణలో టీడీపీ ఫోకస్ చేస్తున్నదన్నారు. తమకు ఆ రాష్ట్రంలో కార్యకర్తలు ఉన్నారన్నారు. ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీని బలోపేతం చేస్తామన్నారు. 

Advertisment
తాజా కథనాలు