All-party Meeting: ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. కశ్మీర్‌లో రాహుల్ గాంధీ పర్యటన

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత గురువారం ఆల్ పార్టీ మీటింగ్ జరింగింది. కేంద్రం ఏ చర్యలు తీసుకున్నా పూర్తిగా మద్దతిస్తామని అన్నీ పార్టీలు తెలిపాయి. దాడిలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ రేపు కశ్మీర్లో పర్యటించనున్నారు.

New Update
_All-party meeting

All-party Meeting: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం దాదాపు 5 గంటలపాటు జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, జైశంకర్, నిర్మల సీతారామన్ , కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, ఖర్గే హాజరైయ్యారు. ఓవైసీ పార్టీ నుంచి అసదుద్దీన్ పాల్గొన్నారు. ఉగ్రదాడిపై రాజకీయ ఏకాభిప్రాయం కోసం అఖిల పక్ష సమావేశం నిర్వహించారు.

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు. అన్నీ పార్టీ నేతలు మౌనం పాటించి.. మృతులకు సంతాపం తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సమర్థిస్తామని అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న  నాయకులు తెలిపారు. రేపు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఉగ్రదాడిలో గాయపడ్డవారిని ఆయన పరామర్శించనున్నారు. శుక్రవారం అనంతనాగ్ జీఎంసీలో బాధితులకు కలుస్తారు.

Also Read: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Also Read: లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి

(all-party-meeting | attack in Pahalgam | breaking news pahalgam | Pahalgam attack | Pahalgam incident | rahul gandhi kashmir | rahul-gandhi)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు