/rtv/media/media_files/2025/04/28/3G0MuFsJkaLP1vusOpyZ.jpg)
Telangana High Court
Telangana Group-1: తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ షాక్ ఇచ్చింది. తప్పుడు ప్రమాణ పత్రాలతో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు రూ.20 వేల జరిమానా విధించింది. అంతేకాదు వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో 19 మంది అభ్యర్థులు దీనిపై పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ
మెమోకు, వెబ్‌సైట్‌లోని మార్కులకు తేడాలు ఉన్నాయని పిటిషన్‌లో తెలిపారు. మళ్లీ మూల్యాంకనం చేసి మార్కులు పారదర్శకంగా వెల్లడించాలని కోరారు. అయితే దీనిపై కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ప్రాథమిక వివరాలను పరిశీలించిన కోర్టు.. అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని గుర్తించింది. వాస్తవాలను చెప్పకుండా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించారని మండిపడింది. దీంతో తప్పుడు ప్రమాణ పత్రాలతో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు రూ.20 వేల జరిమానా విధించింది. అలాగే వీళ్లపై చర్యలు తీసుకోవాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
Also Read: భారత్, పాక్ మధ్య అణు యుద్ధం.. ఎవరి బలం ఎంత?
ఇదిలాఉండగా.. తెలంగాణలో ఇటీవల గ్రూప్ 1 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. హైకోర్టు గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని హెకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీలు దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టు సీజే ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది.
Also Read: ఇండియాతో యుద్ధం వద్దు.. పాక్ మాజీ ప్రధాని కీలక సూచనలు
Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ