Group 1 Results: గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు...  హైయెస్ట్ మార్కులు వీరికే .. కటాఫ్ ఎంతంటే!

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు నిన్న వెలువడ్డాయి. హన్మకొండకు చెందిన తేజస్విని 532.5 మార్కులు, హైదరాబాద్‌కు చెందిన శివరాజ్‌ పబ్బా 506, చందన 503.5 మార్కులు సాధించారు. రీకౌంటిగ్ ప్రక్రియ పూర్తయ్యాకే జనరల్ ర్యాకింగ్ లిస్టు వెల్లడించనున్నారు.

New Update
group1 exam topers

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు (Group 1 Exam Results) నిన్న వెలువడ్డాయి. టీజీపీఎస్సీ (TGPSC) ఆఫీసులో కమిషన్ ఛైర్మెన్ బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేశారు. అభ్యర్థుల లాగిన్ లో పేపర్ల వారీగా మార్కులను ప్రకటించారు.  మార్చి 24 వరకు రీకౌంటిగ్ కు అవకాశం కల్పించారు.  టీజీపీఎస్సీ వెబ్‌ సైట్ లోకి వెళ్లి టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్, డెట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి పేపర్ల వారీగా మార్కులు చూసుకోవచ్చు. 7 పేపర్ల మార్కులు మార్చి 16 వరకు వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు తమ మార్కుల షీట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రీకౌంటిగ్ కోసం ఒక్కో పేపర్ కోసం రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటిగ్ ప్రక్రియ పూర్తి అయ్యాకే జనరల్ ర్యాకింగ్ లిస్టు వెల్లడించనున్నారు.  ఆ తరువాత అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నారు.  జనరల్ 440, ఎస్సీ, ఎస్టీ 420 వరకు కటాఫ్ ఉండవచ్చు అని తెలుస్తోంది.  

Also Read :  అబ్బా భలే ఉంది.. ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం AI-జనరేటెడ్ పాట

ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు హన్మకొండలోని విద్యానగర్ కు చెందిన తేజస్విని 532.5 మార్కులు సాధించినట్టుగా తెలుస్తోంది. జనరల్‌ ఎస్సేలో 79.5, హిస్టరీ, కల్చర్‌, జాగ్రఫీలో 102, ఇండియన్‌ సొసైటీ, కానిస్టిట్యూషన్‌ అండ్‌ గవర్నెన్స్‌లో 89.5, ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌లో 113.5, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రెటేషన్‌లో 68, తెలంగాణ మూమెంట్‌ అండ్‌ స్టేట్‌ ఫార్మేషన్‌లో ఆమె 80 మార్కులు సాధించిందని సమాచారం. అర్హత పరీక్ష జనరల్‌ ఇంగ్లిష్‌లో తేజస్విని 150కి 121 మార్కులు సాధించినట్లుగా తెలుస్తోంద. అత్యధిక మార్కులు సాధించినవారి లిస్టు రీకౌంటింగ్‌ గడువు ముగిశాక తెలియనుంది. ఇక  హైదరాబాద్‌కు చెందిన శివరాజ్‌ పబ్బా 506, జి.చందన 503.5 మార్కులు సాధించారు. 450 నుంచి 500 మార్కులు వచ్చిన అభ్యర్థులు మెరుగైన పోస్టులు సాధించే అవకాశాలున్నాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read :  రాజకీయ భవిష్యత్తుపై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ప్రకటన!

Also Read :  లక్నోకు బిగ్ షాక్.. ఫస్టాఫ్‌కు మయాంక్ దూరం!

ఇంగ్లిష్ లో క్వాలిఫై అయితేనే ర్యాంక్

తెలంగాణ (Telangana) లో 563 పోస్టుల భర్తీకి 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్1 మెయిన్ ఎగ్జామ్స్ ను  నిర్వహించారు. ఈ పరీక్షలకు 31 వేల 403 మందిని ఎంపిక చేస్తే ఇందులో 21 వేల 93 మంది హాజరయ్యారు. ఇంగ్లిష్ తో పాటు మరో ఆరు సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు జరగగా..  ఒక్కో పేపర్ 150 మార్కులుంటాయి. అయితే, దీనిలో ఇంగ్లిష్ పరీక్ష క్వాలిఫై టెస్టు. ఇందులో క్వాలిఫై అయితేనే.. మిగిలిన ఆరు పరీక్షల్లో వచ్చిన మార్కులను లెక్కిస్తారు. ఇంగ్లిష్ లో జనరల్ కేటగిరీల అభ్యర్థులకు 40 శాతం, బీసీలకు 35శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30శాతం  మార్కులు వస్తేనే క్వాలిఫై అవుతారు. దీంట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకే మిగిలిన ఆరు సబ్జెక్టులకు సంబంధించి 900 మా ర్కులకు గానూ.. వచ్చే మార్కులను బట్టి జనరల్ ర్యాంకింగ్ లిస్టులను టీజీపీఎస్సీ వెల్లడిస్తుంది.

Also Read :   మిచెల్ సాంట్నర్కు బిగ్ షాక్ .. కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసిన బోర్డు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు