BIG BREAKING: రాజకీయ భవిష్యత్తుపై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ప్రకటన!

తన రాజకీయ భవిష్యత్తు పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు.

New Update
RS Praveen

RS Praveen

తన రాజకీయ భవిష్యత్తు పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. 

తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో, ఏ వర్గాల భవిష్యత్తు కోసం పనిచేయాల్నో క్లారిటీ ఉందని స్పష్టం చేశారు. మీ లాగా పదవుల కోసం ఢిల్లీకి మూటలు మోసే సంస్కృతి తనకు లేదన్నారు. అన్ని పైసలు కూడా తన వద్ద లేవన్నారు. తెలంగాణలో తరతరాలుగా అణచివేతకు గురైన వర్గాల విముక్తికి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీనే సరైన వేదిక అని బలంగా నమ్మి ముందుకు వెళ్తున్నానన్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ ప్రోత్సాహంతో తెలంగాణ 2.0 ను ఎలా సృష్టించాలన్న పనిలో బిజీగా ఉన్నానన్నారు. 

Advertisment
తాజా కథనాలు