Telangana: నేటి నుంచే రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్‌.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

తెలంగాణలో నేటి (జూన్ 2) నుంచి అన్ని స‌బ్‌ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్‌ ప్రారంభం కానుంది. 82476 23578 వాట్సాప్ నెంబర్‌తో వాట్సప్ చాట్‌బాట్ మేధా సేవలు అందించనుంది. ఆస్తుల క్రయవిక్రయాల్లో అవినీతిని నివారించేందుకు దీన్ని తీసుకొచ్చారు.

author-image
By B Aravind
New Update
Telangana Govt to Launch Slot Booking and AI Chatbot for Property Registrations from June 2

Telangana Govt to Launch Slot Booking and AI Chatbot for Property Registrations from June 2

తెలంగాణలో నేటి (జూన్ 2) నుంచి అన్ని స‌బ్‌ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్‌ ప్రారంభం కానుంది. 82476 23578 వాట్సాప్ నెంబర్‌తో వాట్సప్ చాట్‌బాట్ మేధా సేవలు అందించనుంది. ప్రజలకు మరింత సులువైన సమర్ధవంతమైన సేవలు అందించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివార్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు. ''రాష్ట్రంలో 144 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ఇప్పటిదాకా రెండు విడుతల్లో ప్రయోగాత్మకంగా 47 చోట్ల స్లాట్‌ బుకింగ్ విధానాన్ని అమలు చేశాం. 

Also Read: జగన్నాథుడి రథచక్రాలుగా సుఖోయ్‌ ఫైటర్‌ జెట్‌ టైర్లు (VIDEO)

TG Govt Launch Slot Booking And AI Chatbot

జూన్ 2 నుంచి 97 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అమ‌లు చేయడానికి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశాం.  రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకొస్తున్న నేప‌థ్యంలో ఎలాంటి సాంకేతిక స‌మ‌స్యలు రాకుండా ముంద‌స్తు జాగ్రత్తలు తీసుకోవాల‌ని అధికారులకు సూచించాం. 

ఆస్తుల క్రయ విక్రయ‌దారుల‌కు స‌మ‌యం ఆదా అయ్యేలా పార‌ద‌ర్శకంగా  మెరుగైన సేవ‌లు అందించేందుకు చేప‌ట్టిన స్లాట్ బుకింగ్ విధానం చేపట్టాం. 94 శాతం ప్రజ‌లు దీనిపై  సంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి దశలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఏప్రిల్ 10 నుంచి ఇప్పటివరకు 30,592 డాక్యుమెంట్లు , రెండో దశలో 25 కార్యాలయంలో మే 12 నుంచి ఇప్పటివరకు 14,099 డాక్యుమెంట్లు .. మొత్తం 45,191  డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. స్లాట్ బుకింగ్ వల్ల మూడు వేల డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగాయి. 

Also Read: వణుకు పుట్టిస్తున్న కరోనా.. తొమ్మిది మంది మృతి - అధికంగా ఆ రాష్ట్రంలో కేసులు!

స్లాట్ బుకింగ్ విధానంతో పాటు కృత్రిమ మేధ అనుసంధానంతో కూడిన చాట్‌బాట్ -మేధ 82476 23578 వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ నూత‌న ప్రక్రియ వ‌ల్ల రిజిస్ట్రేష‌న్ చేసుకునే వారికి క‌లిగే సందేహాలు నివృత్తి అవుతాయి. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లొకేషన్, స్లాట్ బుకింగ్ ఖాళీల వివ‌రాలు, స‌మ‌యం అందుబాటు వంటి స‌మాచారం ల‌భిస్తుంది. గిప్ట్ డీడ్‌, సేల్ డీడ్ పై రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు  మార్కెట్ ధ‌ర‌లు త‌దిత‌ర అన్ని అంశాల‌పై  ఈ ఎఐ చాట్‌బాట్ - మేధ ద్వారా స‌మాచారం తెలుసుకోవ‌చ్చని'' మంత్రి పొంగులేటి వివరించారు. 

Also Read :  కవిత్వమే ఆయుధంగా కాళోజి .. బతుకంతా తెలంగాణ కోసమే !

Also Read :  అగ్రతారల ‘జూన్‌’.. బడా హీరోలదే హవా - మొత్తం ఎన్ని సినిమాలంటే?

 telugu-news | rtv-news | sub-registrar

Advertisment
Advertisment
తాజా కథనాలు