/rtv/media/media_files/2025/06/02/D7VTWol4RfY1EtDv6Qa3.jpg)
June Movies In Tollywood
జూన్ నెలలో అగ్రతారలదే హవా కొనసాగనుంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా నాలుగు బడా హీరోల సినిమాలు ఈ నెలలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. బాక్సాఫీసును షేక్ చేసేందుకు అగ్ర హీరోలు కాచుకు కూర్చున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా వారం గ్యాప్‌లో సినిమాలు షేక్ చేయనున్నాయి. చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌లో ఇలాంటి పండుగ వాతావరణం కనిపించడంతో సినీ ప్రియులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆ చిత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : అయ్యో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో 21 మంది అథ్లెట్స్ మృతి
థగ్ లైఫ్
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ చిత్రం జూన్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శింబు, త్రిష, జోజు జార్జ్, అశోక్ సెల్వన్ వంటి స్టార్ క్యాస్టింగ్ నటిస్తుంది. దీంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగాయి. టీజర్, ట్రైలర్‌లకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : కవిత్వమే ఆయుధంగా కాళోజి .. బతుకంతా తెలంగాణ కోసమే !
హరిహర వీరమల్లు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లముడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read : నేటి నుంచే రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
కుబేర
ధనుష్, నాగార్జున కలిసి నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. ఇందులో నేషనల్ క్రష్ రష్మక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరిగే ఆసక్తికర కథతో రూపొందింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ అండ్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం జూన్20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.
Also Read : మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా..
కన్నప్ప
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో బడా బడా హీరోలు నటిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, మోహన్ బాబు సహా మరెందరో ఇందులో భాగమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్‌కు ఫుల్ రెస్పా్న్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని జూన్ 27న రిలీజ్ కానుంది.
kannappa | Thug Life | Kubera Movie Updates | Harihara veeramallu