/rtv/media/media_files/2025/02/12/av8Da2hPdtK1Kh5ypmak.webp)
CASTE CENSUS
బీసీ రిజర్వేషన్ల(bc reservation issue) విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాగైన ముందుకు వెళ్లాలని భావిస్తోంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కలిపించే ప్రయత్నం చేస్తోంది. అయితే కొర్టులు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన కులగణన సర్వే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. డెడికేషన్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టలేదని, నిజంగానే కాంగ్రెస్‍కు చిత్తశుద్ధి ఉంటే ఈ వివరాలు బయటపెట్టాలని అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: ఈ అక్కాచెల్లెళ్లు మామూలోల్లు కాదు.. పెళ్లిళ్లు చేసుకుంటూ డబ్బులు, నగలతో పరార్
Telangana Government Censational Decision About Caste Census
ఈ క్రమంలో తాజాగా మంత్రి వాకిటి శ్రీహరి(vakiti srihari) చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. త్వరలోనే డెడికేషన్ కమిషన్, బీసీ కమిషన్, ఎంపిరికల్ డేటా అంతా పబ్లిష్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ బీసీ బంద్‍లో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎంపిరికల్ డేటా వివరాలు బయటపెట్టకపోవడానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయని ఎవరూ అడ్డంకులు సృష్టించకూడదనే ఈ వివరాలు పబ్లిక్ డొమైన్‍లో ఇంత కాలం పెట్టలేదన్నారు. కానీ కోర్టుల్లో సమర్పించిన వివరాలతోనే ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు. మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు.
Also Read: అఫ్గాన్, భారత్‌తో యుద్ధానికి సిద్ధం.. పాక్ సంచలన ప్రకటన
అంతేకాక కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే మూలంగానే తెలంగాణలో బీసీల లెక్కలు తేలాయని వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు ఇవ్వదని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. పార్టీకి నష్టం అని తెలిసినా కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిందని గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి ఉందని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇచ్చినట్లే ఇచ్చి కోర్టుకు వెళ్లినట్లు తాము బీసీ రిజర్వేషన్ల విషయంలో అలా చేయడం లేదన్నారు.
Also Read: దీపావళిపై ఆంక్షలు.. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత!
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణకు స్వయంగా డిప్యూటీ సీఎం, బీసీ మంత్రులం హాజరయ్యామని ఇలాంటిది చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? అని ప్రశ్నించడం గమనార్హం. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. బీసీలకు న్యాయం జరిగే ఇంత మంచి అవకాశం మళ్లీ మళ్లీ రాదని మంత్రినై ఉండి కూడా రెండు రోజుల పాటు తాను హైకోర్టులోనే ఉన్నానని తెలిపారు. కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లాల్సిలేకుండేనని, ఈ అంశాన్ని బీసీ రిజర్వేషన్లకు ముడిపెట్టవద్దన్నారు. ఇది వేరే విషయం అని ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చూసుకుంటారని చెప్పారు. కొండా సురేఖ అంశాన్ని చూపుతూ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తక్కువ చేయొద్దని సూచించారు.
Also Read: రీ-రిలీజ్ కి ప్రీమియర్ షోస్ ఏంట్రా..? "బాహుబలి: ది ఎపిక్" పెద్ద ప్లానే ..!