/rtv/media/media_files/2025/10/16/baahubali-the-epic-2025-10-16-15-45-12.jpg)
Baahubali The Epic
Baahubali The Epic: ఎస్.ఎస్.రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన వెండి తెర అద్భుతం బాహుబలి సిరీస్ మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ రెండు భాగాలను కలిపి, కొత్తగా కట్ చేసి "బాహుబలి: ది ఎపిక్" పేరుతో ఓ సింగిల్ పార్ట్ సినిమాగా తీసుకొస్తున్నారు.
Also Read: మహేష్ బాబుతో లవ్ స్టోరీ చేస్తా.. 'లిటిల్ హార్ట్స్' డైరెక్టర్ వైరల్ కామెంట్స్..!
Also Read: రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!
మన తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి ది ఎపిక్ సినిమాని రీ రిలీజ్ కి ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తునట్టు సమాచారం. అదే గనక జరిగితే రీ రిలీజ్ సినిమాకు ప్రీమియర్ షోస్ వేయడం ఇదే మొదటి సారి అవుతోంది. ఇంకో విషయమేంటంటే ఈ సినిమాకు ఎటు వంటి టికెట్ రేట్ల పెంపు ఉండదని మూవీ టీమ్ ముందుగానే తెలిపారు.
అక్టోబర్ 31న భారీగా విడుదల..
ఈ ప్రత్యేక ఎడిషన్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా, కొద్ది గంటల్లోనే 3001 టిక్కెట్లు అమ్ముడై, $60,000కి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు 107 ప్రదేశాల్లో, 107 షోలకు బుకింగ్స్ ఓపెన్ చేయగా, ఇంకా 14 రోజులు టైం ఉండడంతో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక
అమెరికాలో అభిమానులు ప్రత్యేకంగా పాస్‌లు పెట్టాలని కోరగా, మేకర్స్ వెంటనే స్పందించి అవి అందుబాటులోకి తెచ్చారు. దీని వలన టికెట్ సేల్స్ మరింతగా పెరగనున్నాయి. ఇది రీ-రిలీజ్ సినిమాల్లోనే కాదు, కొత్త సినిమాలను కూడా క్రాస్ చేయొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఈసారి బాహుబలి సినిమాను మరింత గ్రాండ్‌గా చూసేందుకు IMAX, 4DX, DBox, Dolby Cinema, EpiQ, ICE, PCX లాంటి మల్టీప్లెక్స్ ఫార్మాట్లలో విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల్లో ఇలా అన్ని ఫార్మాట్లలో ఒకేసారి రిలీజ్ కావడం చాలా అరుదు.
Also Read: 'నా డార్లింగ్ సో స్వీట్'.. ప్రభాస్ ని పొగిడేస్తున్న ముద్దుగుమ్మ..!
నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ, అన్ని ఫార్మాట్లకు కంటెంట్‌ను సమయానికి అందించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి కష్టపడుతున్నామని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న హైప్ చూస్తే, "బాహుబలి: ది ఎపిక్" మరోసారి బాక్సాఫీస్‌లో రికార్డులు తిరగరాయడం ఖాయం అనిపిస్తుంది. రాజమౌళి మాయాజాలాన్నీ మరోసారి తెరలపై చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులు అక్టోబర్ 31 తేదీని మిస్ కాకుండా మీ కేలండర్‌లో మార్క్ చేసుకోండి!