/rtv/media/media_files/2025/10/17/pakistan-amid-taliban-conflict-2025-10-17-17-50-59.jpg)
India could play dirty at border, ready for two-front war, Says Pakistan amid Taliban conflict
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. భారత్ కూడా అఫ్గానిస్థాన్‌కు సపోర్టు ఇస్తోంది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్, అఫ్గాన్ దగ్గరవ్వడంతో పాకిస్థాన్ మళ్లీ మేకపోతు గాంభీర్యం చూపిస్తోంది. పాక్ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో నోటికొచ్చిన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో కూడా సరిహద్దు సరిహద్దు ఉద్రిక్తతలు ఎదురైతే పరిస్థితి ఏంటని యాంకర్ మంత్రిని ప్రశ్నించారు.
దీనికి ఆయన స్పందిస్తూ '' ఆ విషయాన్ని కొట్టిపారేయలం. అఫ్గాన్, భారత్‌తో ద్విముఖ యుద్ధానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉంది. దీనికోసం మా వద్ద వ్యూహాలు కూడా ఉన్నాయి. కానీ వాటి గురించి ఇప్పుడు నేను మాట్లాడను. మా దేశంలో నివసిస్తున్న అఫ్గాన్ శరణార్థుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్లు దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం పాక్‌లో అక్రమంగా ఉంటున్న వాళ్లని గుర్తిస్తున్నాం. వెంటనే వాళ్లు మా దేశం నుంచి వెళ్లిపోవాలని'' అన్నారు.
Also Read: ఈ అక్కాచెల్లెళ్లు మామూలోల్లు కాదు.. పెళ్లిళ్లు చేసుకుంటూ డబ్బులు, నగలతో పరార్
ఇదిలాఉండగా పాకిస్థాన్-అఫ్గాన్ సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇరువైపుల ప్రాణనష్టం జరిగింది. అయితే పాకిస్థాన్‌పై దాడులు మొదలైనప్పుడు అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఢిల్లీలోనే ఉన్నారని పాక్ ఆరోపిస్తోంది. భారత్ ఆదేశాల మేరకు తమపై దాడులు చేశారని పిచ్చి కూతలు కూస్తోంది. భారత్ తరఫున అఫ్గాన్ తమపై పరోక్ష యుద్ధానికి దిగిందని పాక్ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆరోపించారు.
దీనిపై భారత విదేశాంగ శాఖ కూడా పాక్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. '' ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తూ వాళ్ల కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. తనకు అంతర్గత వైఫల్యాలాలు తలెత్తితే ఇతరులను నిందించడం ఆ దేశానికి అలవాటే. అఫ్గానిస్థాన్ తన సొంత భూభాగాలపై సార్వభౌమత్వం కోసం పోరాడుతోంది. ఇది పాకిస్థాన్‌కు కోపం తెప్పిస్తోందని'' ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: దీపావళిపై ఆంక్షలు.. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత!