TG Good News: వారికి కూడా రుణమాఫీ.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. చేనేత కార్మికులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అందు కోసం రూ. 33 కోట్లను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
saving money

Rythu runa mafi

TG Good News: తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎంతో ఊరటనిచ్చే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని చేనేత కార్మికులు వ్యక్తిగతంగా తీసుకున్న రూ. లక్ష వరకు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ పథకం అమలుకు అవసరమైన రూ. 33 కోట్లను మంజూరు చేస్తూ జులై 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా వృత్తి పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న అనేకమంది చేనేత కార్మికులకు ఆర్థిక ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా వస్త్ర ఉత్పత్తి, నిర్వహణ, మూలధన అవసరాలు, ఇతర వృత్తి సంబంధిత అవసరాల కోసం తీసుకున్న రుణాలు ఈ పథకంలోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది.

చేనేత కార్మికులకు రుణమాఫీ..

ఇది తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ పథకం తరహాలోనే చేనేత రంగానికి గణనీయమైన ప్రయోజనం చేకూర్చే విధంగా రూపు దిద్దుకుంది. ఇటీవలే సర్కార్ రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసి దాదాపు 22 లక్షల మందికి రూ. 25 వేల కోట్లకు పైగా నిధులను నాలుగు విడతల్లో విడుదల చేసింది. ఇప్పుడు అదే తరహాలో చేనేత రంగానికీ మద్దతు తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 మధ్య కాలంలో తీసుకున్న రుణాలు అసలు, వడ్డీ ఈ మాఫీ పరిధిలోకి వస్తాయి.

ఇది కూడా చదవండి: చిన్న పండుతో కాలేయానికి పెద్ద మేలు

రుణమాఫీ అమలుకు జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ, రాష్ట్రంలో చేనేత సంచాలకుడి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటయ్యాయి. జిల్లా కమిటీ ప్రతిపాదనల ఆధారంగా రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిన తర్వాత మాఫీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు. అనంతరం బ్యాంకులు నో డ్యూస్ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తాయి. రుణమాఫీ అనంతరం అర్హులైన కార్మికులు తిరిగి రుణాల కోసం దరఖాస్తు చేయవచ్చు. అయితే ప్రస్తుతం చేనేత పనుల్లో లేని వారు లేదా వారి ఖాతాలు ఎన్‌పీఏ కింద ఉన్నవారికి తిరిగి రుణాలు ఇవ్వబోమని ప్రభుత్వం పేర్కొంది.  

ఇది కూడా చదవండి: రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!

( ts-news | Latest News | telugu-news | runa-mafi | rythu-runa-mafi | telangana-rythu-runa-mafi | revanth reddy sensational decision on rythu runa mafi | cm revanth key decision on rythu runa mafi)

Advertisment
Advertisment
తాజా కథనాలు