రుణమాఫీ కాలేదని.. మనస్తాపంతో రైతు ఆత్మహత్య
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలు, రుణమాఫీ కాలేదని మనస్తాపంతో రవి అనే రైతు తన పొలంలోనే పురుగుల మందు తాగాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు.