రుణమాఫీ 70శాతమే.. 100శాతం అని చెప్పడానికి సిగ్గుండాలి: కేటీఆర్
70శాతం రుణమాఫీ చేసి 100శాతం చేశామని చెప్పడానికి సీఎం రేవంత్‌కు సిగ్గుండాలని కేటీఆర్ అన్నారు. రేవంత్ సొంత గ్రామం కొండారెడ్డిపల్లెకు వెళితే బండారం బయటపడుతుందన్నారు. ఎన్నికలకు ముందు అందరికీ అన్ని.. ఇప్పుడు కొందరికి కొన్ని అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.