అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమోషనల్.. ఎందుకంటే?

SC వర్గీకరణ అసెంబ్లీలో ప్రవేశపెడుతుండగా CM రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. 20ఏళ్లు రాజకీయ జీవితంలో ఆత్మసంతృప్తి కలిగించిన రోజు ఇదే అన్నారు. 3 దశాబ్దాల పోరాటానికి SC వర్గీకరణ పరిష్కారం. ఇలాంటి అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందని CM రేవంత్ రెడ్డి అన్నారు.

New Update
Cm revanth reddy assembly

Cm revanth reddy assembly Photograph: (Cm revanth reddy assembly)

ఎస్సీ వర్గీకరణ ప్రకటన సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురైయ్యారు. 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు శాశ్వత పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు రేవంత్ రెడ్డి. 20ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. నా జీవితంలో ఆత్మసంతృప్తిని కలిగించిన రోజు ఇదే అని ముఖ్యమంత్రి ఎమోషనల్ అయ్యారు. 

Also Read: మెక్సికో, కెనడాకు బంపరాఫర్‌ ఇచ్చిన ట్రంప్‌ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు!

గతంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు మద్దతిస్తే సభ నుంచి బయటకు పంపించారని.. కానీ ఈనాడు సభా నాయకుడిగా వర్గీకరణ అమలుకు నిర్ణయం తీసుకుంటున్నానని గుర్తుచేసుకున్నారు. ఇలాంటి అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందని, చరిత్రపుటల్లో ఇది శాశ్వతంగా నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైందని అన్నారు. అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ కార్యక్రమానికి సభ్యులందరి సహకారం ఉండాలని కోరారు.

ఇది కూడా చదవండి: Fire Accident In Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేయాలని ఏకసభ్య కమిషన్ సిఫారసు మేరకు 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లను మూడు గ్రూపులుగా విభజిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వివరించారు. ఎస్సీలో మొత్తం 59 ఉపకులాలు ఉన్నాయని, వాటిని గ్రూప్ 1, 2, 3లుగా వర్గీకరించాలని కమిషన్ సూచించిదని రేవంత్ రెడ్డి తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు