ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆదివారం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటుండగా తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం జాకీర్ అస్వస్థకు గురవ్వడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ ప్రాణాలు విడిచారు. Also Read: మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ.. 39 మంది MLAలు మంత్రులుగా ప్రమాణం Also Read : పొట్టి శ్రీరాములు పేరుతో త్వరలో తెలుగు యూనివర్సిటీ Tabla Maestro Zakir Hussain ఇన్నాళ్లు సంగీత ప్రపంచంలో యాక్టివ్‌గా ఉన్న జాకీర్ హుస్సేన్‌కు కోట్లాది మంది అభిమానులున్నారు. జాకీర్ మరణవార్తతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. 1951, మార్చి 9న ముంబయిలో జాకీర్ హుస్సేన్ జన్మించారు. తన 11వ ఏటనే అమెరికాలో మొదటిసారిగా కచేరీ చేశారు. తన మొదటి ఆల్బమ్ 1973లో విడుదల అయ్యింది. తబల వాయించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాకీర్.. ఎన్నో అవార్డులు పొందారు. మూడు గ్రామీ అవార్డులు అందుకున్నారు. అలాగే 2023లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషన్‌తో సత్కరించింది. Also Read : పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్! Also Read : వెయ్యి మందికి పైగా.. బీభత్సం సృష్టిస్తున్న ఛీడో తుపాను