Bigg Boss 8: 'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్

బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిఖిల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. టైటిల్ గెలవడంతో రూ.55 లక్షల ప్రైజ్ మనీతో పాటు.. లగ్జరీ కారుని సొంతం చేసుకున్నాడు. ఇక గౌతమ్ రన్నరప్ గా  నిలిచాడు.

New Update
bb8 (1)

బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిఖిల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. టైటిల్ గెలవడంతో రూ.55 లక్షల ప్రైజ్ మనీతో పాటు.. లగ్జరీ కారుని సొంతం చేసుకున్నాడు. ఇక గౌతమ్ రన్నరప్ గా  నిలిచాడు. బిగ్‌బాస్‌-8 ఫినాలేకు వచ్చిన విజయ్‌ సేతుపతి, ముంజు వారియర్‌ తమ సినిమా గురించి మాట్లాడారు. 

Also Read :  ప్రభాస్ తో మృణాల్ ఠాకూర్ రొమాన్స్..!

Bigg Boss 8 Winner Nikhil

అనంతరం హౌస్‌లోకి వెళ్లి, ఉన్న ముగ్గురిలో తక్కువ ఓట్లు వచ్చిన నబీల్‌ను బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత నిఖిల్, గౌతమ్ టాప్ 2 లో ఉండగా.. నాగార్జున హౌస్ లోకి వెళ్లి వాళ్లకు గోల్డ్ సూట్ కేస్ అఫర్ చేశారు. కానీ దాన్ని ఇద్దరూ రిజెక్ట్ చేశారు. దాంతో నాగార్జున ఇద్దరినీ స్టేజ్ పైకి తీసుకువచ్చారు. ఆ తర్వాత చీఫ్ గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ ముందు నిఖిల్ ను విన్నర్ గా అనౌన్స్ చేశారు నాగార్జున.

Also Read :  తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

కాగా ఈ సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా  అడుగు పెట్టాడు నిఖిల్. మొదటి నుంచి తన ఆట, మాటతీరుతో అందరి మనసులు గెల్చుకుంటున్నాడు. ఇక ఫిజికల్ టాస్కుల్లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేశాడు. దీంతో టాప్ -2లోకి వచ్చాడు. ఇక గౌతమ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్ లో ఎదురైన చేదు అనుభవాలను చక్కదిద్దుకుంటూ చక్కటి ఆటతీరు ప్రదర్శించాడు. ఇప్పుడు ఏకంగా టైటిల్ ఫేవరేట్లలో ఒకడిగా నిలిచాడు.

Also Read :  మంచు ఫ్యామిలీలో మళ్లీ రగడ.. మనోజ్‌ ఇంటికి కరెంట్ కట్

Also Read :  నాగబాబు ఇంటికి అల్లు అర్జున్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు