Pushpa 2:పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్!

ఈ రోజు చిరంజీవి, నాగబాబును వారి నివాసాలకు వెళ్లి మరీ కలిసిన అల్లు అర్జున్ త్వరలోనే పవన్ కల్యాణ్ ను కూడా కలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో వీరి భేటీ ఉండే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.

author-image
By Nikhil
New Update

మెగా ఫ్యామిలీలో వార్ అంటూ కొన్ని రోజులుగా మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో మొదలైన వివాదం ఇంకా చల్లారలేదు. ఈ విషయమై నిత్యం అల్లు అర్జున్, మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంది. అయితే.. ఇటీవల అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లిన సమయంలో తొక్కిసలాట చోటు చేసుకోవడం.. అందులో ఓ మహిళ చనిపోవడంతో కేసు నమోదైంది. ఈ క్రమంలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఓ రోజు రాత్రి జైలు జీవితం కూడా గడిపారు. అయితే.. అల్లు అర్జున్ జైలుకు వెళ్లిన వెంటనే విశ్వంభర షూటింగ్ నుంచి చిరంజీవి హుటాహుటిన అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.

Also Read :  ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!

విడుదలైన తర్వాత చిరంజీవి సతీమణి, అల్లు అర్జున్ మేనత్త సురేఖ వెళ్లి అల్లుడిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ రోజు అల్లు అర్జున్ స్వయంగా కారును నడుపుకుంటూ చిరంజీవి ఇంటికి వెళ్లారు. మెగాస్టార్ ను కలిసి అరెస్ట్ పరిణామాలపై చర్చించారు. అనంతరం నాగబాబు ఇంటికి కడా వెళ్లారు. నాగబాబు అనేక సార్లు అల్లు అర్జు్న్ టార్గెట్ గా సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే.. మెగా ఫ్యామిలీ వార్ అంశానికి చెక్ పెట్టేందుకే అల్లు అర్జున్ ఇలా మెగా హీరోలను వరుసబెట్టి కలుస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read :  నేడు రాజ్యసభలో ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం

త్వరలో పవన్ కల్యాణ్‌ తో భేటీ..

పవన్ కల్యాణ్‌ తో భేటీకి కూడా ఇదే సరైన సమయం అని అల్లు అర్జున్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకట రెండు రోజుల్లో అమరావతి వెళ్ల పవన్ తో భేటీ అవుతారని తెలుస్తోంది. తద్వారా వివాదాలు అంటూ నిత్యం వస్తున్న వార్తలు ఆగుతాయని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ భేటీ జరిగే అవకాశం ఉందన్న చర్చ మెగా కాంపౌండ్ లో సాగుతోంది. 

Also Read :  వెయ్యి మందికి పైగా.. బీభత్సం సృష్టిస్తున్న ఛీడో తుపాను

Also Read :  ప్రభాస్ తో మృణాల్ ఠాకూర్ రొమాన్స్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు