Bhatti Vikramarka: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు

రాష్ట్రంలో భూములు లేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా డిసెంబర్ 28న ప్రారంభించనున్నారు. ఆ రోజే లబ్ధిదారుల అకౌంట్‌లోకి తొలి విడత కింద రూ.6 వేలు జమ చేయనున్నారు.

New Update
Telangana Elections: ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటారు? భట్టి సంచలన కామెంట్స్..

భూమి లేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో భూములు లేని కుటుంబాలకు ఏటా రూ.12000 ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ తెలిపారు. ఈ డబ్బులు రెండు విడతల్లో భూమిలేని నిరుపేద ఖాతాల్లో జమ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28న దీన్ని ప్రారంభించనున్నారు.  ఈ క్రమంలో తొలి విడత కింద ఆరోజే రూ.6000 అకౌంట్లో జమ కానున్నట్లు తెలిపారు.

ఇది కూడా చూడండి: శ్రీతేజ్ ను కలవలేకపోతున్నా.. అల్లు అర్జున్ సంచలన పోస్ట్

ఇది కూడా చూడండి:   పొట్టి శ్రీరాములు పేరుతో త్వరలో తెలుగు యూనివర్సిటీ

చెప్పిన సమయానికే రైతు భరోసా..

ఇచ్చిన హామీలు అన్నింటిని మా ప్రభుత్వం తీరుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. చెప్పిన సమయానికే రైతు భరోసా చెల్లించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా సంక్రాంతికి రైతు భరోసా డబ్బులు ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయానికి, రైతుల కోసం నేరుగా రూ.50,953 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. 

ఇది కూడా చూడండి:   నేడు రాజ్యసభలో ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలుపుతూ రీజినల్‌ రింగ్‌ రోడ్ ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఔటర్‌ రింగ్‌రోడ్, రీజినల్‌ రింగ్‌రోడ్‌ మధ్య ఇండస్ట్రియల్‌, హౌసింగ్‌ క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నా కూడా ఏ పనులు చేయలేదన్నారు. ముఖ్యంగా నీటి పారుదల, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ఆసుపత్రులు, ఉద్యోగుల జీపీఎఫ్‌, మధ్యాహ్న భోజనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం కోట్లు ఖర్చు పెట్టిందని భట్టి అన్నారు. 

ఇది కూడా చూడండి:   భర్తను హతమార్చిన భార్య.. పెళ్లయిన నాలుగు రోజులకే..

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు