/rtv/media/media_files/2025/07/24/green-cardamom-2025-07-24-14-54-52.jpg)
Green Cardamom
Green Cardamom: భారతీయ ఆహార సంస్కృతిలో సుగంధ ద్రవ్యాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి కేవలం ఆహారానికి రుచిని, వాసనను పెంచడమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. అటువంటి ముఖ్యమైన ద్రవ్యాలలో పచ్చి యాలకులు ఒకటి. సాధారణంగా తీపి వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే ఈ యాలకులు రోజూ రెండు తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలను పొందగలరు. ఇది చిన్నగా కనిపించినా.. శక్తివంతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. తిన్న వెంటనే యాలకులు తింటే ఏమవుతుంది..? దాని ప్రయోజనాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
తిన్న వెంటనే యాలకులు తింటే..
యాలకులు శ్వాసను తాజాగానూ, జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా పనిచేయించడానికీ సహాయపడతాయి. వీటిలో ఉండే సహజ నూనెలు, సారాలు గ్యాస్, అజీర్ణం, వాంతులు వంటి సమస్యలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. రాత్రి భోజనం తర్వాత యాలకులు నమలడం వల్ల జీర్ణక్రియ బలపడుతుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. ఆమ్లత సమస్యను కూడా నియంత్రిస్తాయి. యాలకులు జీర్ణక్రియకు అవసరమైన గ్యాస్ట్రిక్ రసాల స్రావాన్ని ప్రేరేపించి.. ఆహారాన్ని వేగంగా జీర్ణించేందుకు సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: కాలిన గాయాలపై టూత్‌పేస్ట్ రాస్తున్నారా..? డాక్టర్ చెప్పే విషయాలు తెలుసుకోండి
ఇందులో ఉండే సహజ సుగంధ గుణాలు నోటికి తాజాదనాన్ని ఇస్తాయి. భోజనం అనంతరం యాలకులు నమలడం వల్ల నోటి దుర్వాసనను నివారించవచ్చు. ఇవి నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడే నూనెలను కలిగి ఉంటాయి. యాలకులకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలోని వాపును తగ్గించి.. శరీరానికి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే వికారం, వాంతుల వంటి సమస్యల నివారణకు కూడా యాలకులను సహజ ఔషధంగా వాడతారు. పచ్చి యాలకులు తిన్న తర్వాత కలిగే ఆహ్లాదకరమైన భావన భోజనానంతర తృప్తిని కలిగిస్తుంది. ఇది కేవలం ఒక మౌత్ ఫ్రెషనర్ మాత్రమే కాకుండా.. ఆరోగ్య పరంగా ఎంతో దోహదం చేసే సహజ ఔషధం కూడా. ఇవి చిన్నవైనా..ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావవంతంగా మారుస్తాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పచ్చి పాలతో చర్మం మెరుస్తుంది.. నల్లటి మచ్చలు మాయమవుతాయి
( green-cardamom | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News)