/rtv/media/media_files/2025/08/02/handloom-workers-2025-08-02-18-05-49.jpg)
Handloom workers
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోంది. తాజాగా తెలంగాణ నేతన్నలకు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీని అమలు చేసింది. నేతన్నలకు రూ.లక్షలోపు గల అన్ని రుణాలను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారి ఖాతాల్లోకి రూ.19. కోట్లు జమ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. 2017 నుంచి 2024 మార్చి వరకు నేత కార్మికులు తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.వాటిని మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చేనేత వస్త్రాల ఉత్పత్తి, నిర్వహణ, నేత వృత్తి సంబంధిత రుణాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. కాగా లక్షలోపు రుణాలు మాఫీ చేసినట్టు ఫోన్లకు మెసేజిలు వస్తుండటంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : క్రీడల్లో ప్రపంచంతో పోటీ పడదాం : సీఎం రేవంత్‌రెడ్డి
Good News For Waiver Of Loans From Telangana
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేతన్నలకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేసింది. ఈ మేరకు యాదాద్రి జిల్లాలోని 2,380 మంది లబ్ధిదారులైన నేత కార్మికుల ఖాతాల్లోకి రూ.19.24 కోట్ల నగదును జమ చేసింది. రుణమాఫీ ప్రక్రియలో భాగంగా 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు చేనేత కార్మికులు తీసుకున్న రూ. లక్ష లోపు రుణాలను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. అయితే చేనేత వస్త్రాల ఉత్పత్తి, నిర్వహణ, వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్న రుణాలు రుణమాఫీ పరిధిలోకి వస్తాయని తెలంగాణ సర్కార్ పేర్కొంది. మరోవైపు ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం 33 కోట్లు విడుదల చేసిందని, ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5691 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందనున్నారని, త్వరలోనే పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి, నిధులు విడుదల చేస్తామని చెప్పారు. అన్నట్లుగానే రూ.19.24 కోట్ల మేరకు రుణాలు మాఫీ చేసినట్లు తెలిపారు.
ఇక యాదాద్రి జిల్లాలో మొత్తం 43 చేనేత సొసైటీలు ఉన్నాయి. ఈ సొసైటీలలో వేలమంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు. 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు యాదాద్రి జిల్లాలోని 39 బ్యాంకుల్లో చేనేత కార్మికులు వ్యక్తిగతంగా పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నారు. వీరిలో 1,162 మంది కార్మికులు రూ. లక్షలోపు రుణం తీసుకున్నవారున్నారు. ఈ మొత్తం రూ. 6 కోట్లు కాగా.. మరో 1,537 నేత కార్మికులు రూ. లక్షకు పైగా సుమారు రూ.24 కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వారికి కూడా లక్ష వరకు రుణం మాఫీ కానుంది. ప్రభుత్వం రుణమాఫీ చేయడంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు నేతన్న పొదుపు పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 33,913 మంది చేనేత కార్మికులు పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ పథకంలో భాగంగా చేనేత కార్మికులు తమ వేతనంలో 8శాతాన్ని బ్యాంకులలో జమచేసుకోవాలి. ప్రభుత్వం 16 శాతం మొత్తాన్ని RD -11 ఖాతాలలో జమచేస్తుంది. అంతేకాక తెలంగాణ నేత కార్మికులకు భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 48.8 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Also Read : హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్..ఇక గాలిలో తేలిపోవాల్సిందే..
handloom-workers | sirisilla-handloom-workers | bank-loans | latest-telugu-news | telugu-news | latest telangana news