/rtv/media/media_files/2025/02/24/nu9NsmnHopjqefZDGjdg.webp)
CM Revanth Reddy
Revanth Reddy: తెలంగాణ యువత ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ర్టంలో క్రీడా విధానం లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాల్లోని యువత పెడదోవ పడుతున్నారన్నారు. క్రీడలను ప్రోత్సహించకపోవడం వల్లే యువత డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారని సీఎం స్పష్టం చేశారు. చదువులతో పాటు క్రీడల్లోనూ యువత రాణించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. హెచ్‌ఐసీసీలో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్‌లో ‘తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ’ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో నూతన క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంతో పోటీపడే మనం.. క్రీడల్లో వెనబడటం బాగాలేదన్నారు. భారత దేశానికి బలమైన క్రీడా వేదిక కావాలని.. అందులో తెలంగాణ ప్రధానంగా ఉండాలని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
క్రీడా విధానంలో రాజకీయ జోక్యాన్ని తగ్గించి క్రీడాకారుల స్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోనే క్రీడా పాలసీని-2025 తీసుకువచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మా విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ -2047 లో స్పోర్ట్స్ పాలసీని ఒక అధ్యాయంగా పెట్టామన్నామని తెలిపారు. పీపీపీ పద్ధతిలో తెలంగాణ నూతన క్రీడా విధానం తీసుకువస్తున్నామని. కార్పొరేట్ రంగంలో సక్సెస్ రేటు ఉన్నవారు, క్రీడల్లో మెడల్స్ సాధించిన వారిని, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వ్యవస్థలను నిర్వహించిన అనుభవం కలిగిన వారిని క్రోడీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక బోర్డును ఏర్పాటు చేసిందని వివరించారు.
Also Read: అయ్యో పాపం.. కళ్లముందే వరదల్లో కొట్టుకుపోయిన రూ.12 కోట్ల బంగారం
ప్రభుత్వాలకు సరైన క్రీడా విధానాలు లేకపోవడం వల్లే యువత వ్యసనాలకు బానిస అవుతున్నారని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించకపోవడం వల్ల మాదక ద్రవ్యాలు మన వైపు యువత అలవాటు పడుతున్నారన్నారు. పోరాట స్పూర్తి ఉన్న తెలంగాణ ప్రాంతం క్రీడల్లో రాణించాలన్నారు. ప్రపంచంతోనే పోటీ పడి దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని తెలంగాణకు నూతన క్రీడా పాలిసీని తీసుకువచ్చామని వివరించారు. అనేక క్రీడామైదానాలు పెళ్లిళ్లు చేసుకునే ఫంక్షన్ హాళ్లుగా లేదా సన్ బర్న్ ఈవెంట్ చేసుకునే వేదికలుగా రూపాంతరం చెందాయన్నారు. ఈ విధానానికి స్వస్తి పలికి స్పష్టమైన క్రీడా విధానాన్ని, స్పోర్ట్స్, యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఎందరో గొప్ప గొప్ప క్రీడాకారులు హైదరాబాద్ నుంచే వచ్చారని సీఎం చెప్పారు. అజారుద్దీన్, రవితాం, వీవీఎస్ లక్ష్మణ్, సిరాజ్, నిఖత్ జరీన్, దీప్తీ మనవాళ్లేనని గుర్తు చేశారు. చదువుల్లోనే కాదు.. క్రీడల్లోనూ రాణించాలన్నారు. ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్లే మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ లో మనం పతకాలు సాధించలేకపోయమన్నారు.140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక్క గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోకపోవడం నిజంగా మన దేశానికి మన జాతికి అవమానం అన ఆయన అన్నారు. ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్న భారత దేశం ఒలింక్ గేమ్స్ పతాకాల్లో 71వ స్థానంలో ఉండటం మనమంతా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. 2026లో ఖేలో ఇండియాను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయాను రిక్వెస్ట్ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ కార్య క్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఒలింపిక్ పతక విజేత అభినవ్ బింద్రా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(క్రీడలు ) ఏపీ జితేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో 'తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ -2025' ను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు అంతర్జాతీయ క్రీడా సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుంది.
Also Read: బరితెగించింది.. భర్తను బతికుండగానే పాతిపెట్టాలని చూసింది... డ్యామిట్ కథ అడ్డం తిరిగింది!