Raddison Blue Drug Case:మరోసారి తెరమీదకి రాడిసన్‌ బ్లూ డ్రగ్స్‌ కేసు వ్యవహారం!

తెలుగు సినీ నిర్మాత కేదార్‌ నాథ్‌ మరణంతో..గతంలో సంచలనం రేపిన రాడిసన్‌ బ్లూ హోటల్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. కేదార్‌ గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నప్పటికీ...అతని మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

New Update
 drugs

drugs

దుబాయ్‌ లో తెలుగు సినీ నిర్మాత కేదార్‌ నాథ్‌ మరణంతో..గతంలో సంచలనం రేపిన రాడిసన్‌ బ్లూ హోటల్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. కేదార్‌ గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నప్పటికీ...అతని మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read:  Horoscope Today: ఆ రాశి వారికి ఈరోజు ప్రమోషన్లు వచ్చే అవకాశాలున్నాయి..మీ రాశేనేమో చెక్‌ చేసుకోండి!

రాష్ట్రంలో వరుసగా అనుమానస్పద మరణాలు సంభవిస్తున్నాయి.కేదార్‌ సైతం అనుమానాస్పదంగా మృతి చెందారు.కేటీఆర్‌కి అతను భాగస్వామిగా ఉన్నారు. రాడిసన్‌ బ్లూ డ్రగ్స్‌ కేసులో నిందితుడు అని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.గతేడాది ఫిబ్రవరి 25వ తేదీ రాత్రి హోటల్‌ లో కేదార్‌ కొకైన్‌ సేవించినట్లు గచ్చిబౌలి పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. 

Also Read: Trump: ఉద్యోగుల తొలగింపు పై ప్రణాళికలు రెడీ చేయండి..ట్రంప్‌ యంత్రాంగం ఆదేశాలు!

కొకైన్‌ ఆనవాళ్లు.....

ప్రముఖ రాజకీయ నేత తనయుడు గజ్జెల వివేకానంద్‌ ఇచ్చిన డ్రగ్స్‌ పార్టీకి పలువురు సినీ ప్రముఖులతో పాటు కేదార్‌ హాజరైనట్లు ఎఫ్‌ఐఆర్‌ లో పేర్కొన్నారు. వివేకానంద్‌ తో పాటు అతని స్నేహితులు డ్రగ్స్‌ తీసుకున్నట్లు హొటల్‌ సిబ్బంది వాంగ్మూలమిచ్చారు.అప్పుడే క్లూస్‌ టీం సహాయంతో పరిశీలించగా కొకైన్‌ ఆనవాళ్లు లభించాయి.

ఆ తరువాత పోలీసులు వివేకానంద్‌ను గచ్చిబౌలి ఠాణాకు తరలించి విచారించగా కేదార్‌ తో పాటు పలువరు కొకైన్‌ సేవించినట్లు అంగీకరించారు. అప్పట్లో వివేకానంద్‌ ,కేదార్‌ లకు నిర్వహించిన డ్రగ్‌ పరీక్షల్లో పాజిటివ్‌ గా తేలింది.

మరో వైపు వివేకానంద్‌ డ్రైవర్‌ కు కొకైన్‌ ను సరఫరా చేసిన అబ్బాస్‌ ను,అతడికి విక్రయించిన హమీద్‌ ను అరెస్ట్‌ చేశారు. కేదార్‌ కు సినీ,రాజకీయ ప్రముఖులను సత్సంబంధాలుండేవి.అతను హైదరాబాద్‌ లో పబ్‌ లను సైతం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేదార్‌ డ్రగ్స్‌ సేవించి దొరకడం అప్పట్లో సంచలనం సృష్టించింది.ఈ కేసులో పోలీసులు నోటీస్‌ ఇచ్చి పంపించివేశారు.

అప్పట్లో బీఎన్‌రెడ్డి నగర్‌ లో ఉన్న కేదార్‌ తర్వాత దుబాయ్‌ కి మకాం మార్చినట్లు తెలుస్తోంది. అక్కడే పలువురు ప్రముఖులతో కలిసి స్థిరాస్తి వ్యాపారంలోకి దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఒక ఫంక్షన్‌ కు హాజరై తిరిగి తన ఇంటికి వచ్చిన కేదార్ నిద్రలోనే చనిపోయినట్లు తెలుస్తోంది. అతనితో పాటు తెలంగాణకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా బస చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: USA: ట్రంప్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన రష్యా..నో అన్న చైనా

Also Read: Nara Lokesh: దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రి నిర్మాణం జరగాలి: నారా లోకేష్

Advertisment
తాజా కథనాలు