USA: ట్రంప్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన రష్యా..నో అన్న చైనా

రక్షణ ఖర్చులు తగ్గించుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. కానీ చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ మాత్రం నో వే అని చెప్పేశారు. 

author-image
By Manogna alamuru
New Update
international

USA, China, Russia

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకతో రాజకీయ సమీకరణాలు కొత్తగా మారుతున్నాయి. అమెరికాకు చైనాతో ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. అయితే వాణిజ్యం, కొన్ని రాజకీయాల పరంగా ఇప్పటివరకు స్నేహంగానే మెలుగుతూ వస్తున్నాయి. మరోవైపు బైడెన్ ప్రభుత్వం ఉన్నవరకు రష్యా, అమెరికాలు శత్రువులుగా ఉన్నారు. అమెరికా ఉక్రెయిన్ కు సాయం, సపోర్ట్ చేస్తుండడంతో రష్యా మండిపడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ట్రంప్ మొత్తం పరిస్థితిని మార్చేశారు. ఆయన వచ్చాక చేపట్టిన చర్యలతో చైనా దూరం మరింత పెరిగింది. రష్యాతో ఇంతకు ముందు ఉన్న సమస్యలు తగ్గి దగ్గరయింది. 

ట్రంప్ ప్రతిపాదనకు రష్యా యెస్..చైనా నో..

ఇప్పుడు మరోసారి ఈ తేడాలు బయటపడ్డాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్..రక్షణ ఖర్చులను 50శాతం తగ్గించుకోవాలంటూ కొత్త ప్రతిపాదనను చేశారు. దీనికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకారం తెలిపారు. కానీ చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ మాత్రం తిరస్కరించారు. ఇది మంచి ప్రతిపాదన అని.. ఇటువంటి ఫలితాలను అన్వేషించడానికి మాస్కో చర్చలకు సిద్ధంగా ఉందని ప్రకటించారు పుతిన్. దీనిలో చైనా కూడా చేరితే అంగీకారం కుదురుతుంది అని అన్నారు. పుతిన్ అంగీకారంతో ఉక్రెయిన్ తో యుద్ధం ముగింపు సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆయన ఈ  నిర్ణయం కనుక తీసుకుంటే యూరప్, నాటో మిత్ర దేశాలకు కూడా ఆనందం కలిగించే వార్తే అవుతుంది. కానీ చైనా మాత్రం మేము అంగీకరించం అంటోంది. అసలే సుంకాల పెంపుతో గుర్రుగా ఉన్న చైనా ట్రంప్ ఏ ప్రతిపాదనలు చేసినా ఒప్పుకునే పరిస్థితి లేదన్నట్టు ప్రవర్తిస్తోంది. తన ఆధిపత్యాన్ని కొనసాగించేటందుకే సుముఖత చూపిస్తోంది. 

Also Read: AP : నటుడు పోసాని అరెస్ట్.. కారణాలివే..

Advertisment
తాజా కథనాలు