Horoscope Today: ఆ రాశి వారికి ఈరోజు ప్రమోషన్లు వచ్చే అవకాశాలున్నాయి..మీ రాశేనేమో చెక్‌ చేసుకోండి!

వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలున్నాయి. మాటల్లో జ్ఞానం, చేతల్లో నాయకత్వ లక్షణాలతో అందరికీ ఆదర్శంగా ఉంటారు. పని ప్రదేశంలో జీతం పెరుగుదల, పదోన్నతులు ఉండవచ్చు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..

New Update
horoscopee

horoscopee

మేషరాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. మీ పరోపకారతత్వం మీకు మంచి గుర్తింపు తీసుకువస్తుంది. ధార్మిక కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. మీ స్నేహితులు మిమ్మల్ని పొగడ్తలతో ముంచుతారు. సన్నిహితుల కోసం అధికంగా ధనవ్యయం చేస్తారు. పెద్దలు, తల్లిదండ్రుల సలహాలు అనుకూలిస్తాయి. జీవితభాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశం ఉంది.

Also Read:  Trump: ఉద్యోగుల తొలగింపు పై ప్రణాళికలు రెడీ చేయండి..ట్రంప్‌ యంత్రాంగం ఆదేశాలు!

వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, అస్సైన్మెంట్లు అనుకూలంగా ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులు తమ పై అధికారుల మెప్పు, సహోద్యోగుల సహాయం పొందగలరు. అనుకోని ప్రమోషన్లు మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాయి. 

Also Read: USA: ట్రంప్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన రష్యా..నో అన్న చైనా

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొత్త పనులు చేపట్టడానికి ఈ రోజు శుభప్రదంగా లేదు. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలించవు. మీ యజమానులు మీ పనిపట్ల అసంతృప్తిగా ఉంటారు.


కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. దురదృష్టం వెన్నాడుతుంది. వృత్తిపరమైన, అనారోగ్య పరమైన చికాకులూ ఉండవచ్చు. కొత్త వ్యవహారాలు మొదలు పెట్టవద్దు. ఇబ్బందులు వస్తాయి. కోపం తగ్గించుకొని శాంతం వహించండి. అనైతికమైన పనులు ఇరుకున పెడతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం కావు.

శత్రువులతో జాగ్రత్త...

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమిస్తేనే విజయం దక్కుతుంది. వృత్తి వ్యాపారాలలో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా మెలగాలి.

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. కీలకమైన పనుల్లో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు ఉండకపోవచ్చు. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసే ఓ మిత్రుడు తారసపడతారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు.


 తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మబుద్ధితో చేసే పనులు సత్వర ఫలితాలనిస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులు ఆగ్రహానికి గురికాక తప్పదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో విజయాలు ఆలస్యమవుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. 


వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలున్నాయి. మాటల్లో జ్ఞానం, చేతల్లో నాయకత్వ లక్షణాలతో అందరికీ ఆదర్శంగా ఉంటారు. పని ప్రదేశంలో జీతం పెరుగుదల, పదోన్నతులు ఉండవచ్చు. వారసత్వపు ఆస్తుల గురించి శుభవార్త వింటారు.


ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తోటివారి సహకారంతో ఇబ్బందులు అధిగమిస్తారు. కుటుంబ కలహాలు తీవ్రం కావచ్చు. వివాదాలకు దూరంగా, సహనంగా ఉంటే మంచిది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.


మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దృఢమైన సంకల్పంతో ముందుకుసాగి విజయాలు అందుకుంటారు. బంధుప్రీతి, భోజసౌఖ్యం ఉంది. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అన్ని పనులు అనుకున్నట్లుగా జరగడం వల్ల ఆనందంగా ఉంటారు.


కుంభరాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. వృత్తి పరమైన ఆర్థిక సంబంధమైన శుభ ఫలితాలతో సంతోషంగా ఉంటారు. తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. ఈ రోజంతా ఆధ్యాత్మికంగా గడపడం ఆనందాన్నిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. 


మీనరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీకు నచ్చిన రంగంలో ముందుకెళ్లి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి.

Also Read: Posani krishna Murali: పోసాని కృష్ణ మురళి అరెస్టు

Also Read: Nara Lokesh: దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రి నిర్మాణం జరగాలి: నారా లోకేష్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు