TungaBhadra : తుంగ భద్రకు పొంచి ఉన్న ముప్పు?.. పనిచేయని గేట్లు..

కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ మూడు  రాష్ట్రాలకు సాగు, తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉంది. ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 33 గేట్లలో మరో ఏడు గేట్లు కూడా పనిచేయడం లేదు. గతేడాది ఆగస్టు 10న కురిసిన భారీ వర్షాలకు 19వ గేటు కొట్టుకుపోయింది.

New Update
Tungabhadra Dam at Risk

Tungabhadra Dam at Risk

TungaBhadra : కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ మూడు  రాష్ట్రాలకు సాగు, తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉంది. ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 33 గేట్లలో మరో ఏడు గేట్లు కూడా పనిచేయడం లేదు. గతేడాది ఆగస్టు 10న కురిసిన భారీ వర్షాలకు19వ గేటు కొట్టుకుపోవడంతో స్టాప్‌లాగ్‌లను ఏర్పాటు చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఏడు గేట్లు పనిచేయకుండా పోయాయని తాజాగా ఇంజినీర్లు నిర్ధారించారు. వచ్చే ఏడాది జూన్‌లోగా మొత్తం 33 గేట్లను మార్చాలని నిపుణులు తేల్చి చెప్పడంతో  జలాశయానికి సమీపంలోని గదగలో గేట్ల నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. 

Also Read: Trump: నా మాట వింటేనే..రష్యాతో వ్యాపారం..భేటీకి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ప్రాజెక్టు గేట్ల నిర్మాణానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే   4, 11, 18, 20, 24, 27, 28 తదితర ఏడు గేట్లూ పనిచేయడం లేదని, దీనివల్ల ప్రమాదానికి ఆస్కారం పొంచి ఉందని ఇంజినీర్లు వెల్లడించారు. దీంతో జలశాయానికి ఎంద వరద వచ్చినా ఈ గేట్లు ఎత్త కూడదని నిర్ణయించారు. ఇంజినీర్లు తెలిపిన దాని ప్రకారం ఒకవేళ వరద నీటిని వదలడానికి ఈ గేట్లను ఎత్తితో ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అందుకే ఎంత వరద వచ్చినా వాటిని మాత్రం ఎత్తకూడదని ఇంజినీర్లు తేల్చి చెప్పారు. అయితే అందులో 4వ గేటునూ మాత్రం ఓ అడుగుదాకా ఎత్తడానికి అవకాశం ఉంది. ఆ తరువాత అదీ మొరాయిస్తోందని ఇంజినీర్లు అంటున్నారు.

Also read : Jharkhand : బాత్రూంలో జారిపడి జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి కన్నుమూత!

ప్రస్తుతం జలాశయానికి ఎగువున కురుస్తున్న వర్షాల మూలంగా23 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో మూడు గేట్లను మాత్రమే పైకెత్తి 9 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మిగిలిన వరదను కాలువలకు వదులుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏ క్షణంలోనైనా డ్యాంకు మరింత వరద పెరిగే అవకాశం ఉంది. నిరుడు లక్ష క్యూసెక్కుల వరద వచ్చిన సమయంలో 19వ గేటు కొట్టుకుపోయింది. ఇప్పుడూ అదే స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉండడం, గేట్లు దెబ్బతినడంతో  సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వరద నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపితే ప్రమాద తీవ్రత అంతగా ఉండకపోవచ్చని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు.

Also read : Trump-Putin Meet: పుతిన్ కు ఆర్య-2 సినిమా చూపించిన ట్రంప్.. అగ్రరాజ్యం బలుపు చూపెట్టిన అమెరికా.. ఈ వీడియోలు చూడండి!

Advertisment
తాజా కథనాలు