Revanth Reddy: కోదండరాంకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తాం.. రేవంత్ సంచలన ప్రకటన!

ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ ఇస్తే కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లి పదవి తొలగించారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇదేం పైశాచిక ఆనందం అని ప్రశ్నించారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ ప్రారంభించారు.

New Update
CM Revanth

ప్రొఫెసర్ కోదండరాం(prof-kodandaram) కు ఎమ్మెల్సీ ఇస్తే కొందరు సుప్రీంకోర్టు(Supreme Court) కు వెళ్లి పదవి తొలగించారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇదేం పైశాచిక ఆనందం అని ప్రశ్నించారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ ప్రారంభించారు. కోదండరాంకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అని సీఎం కొనియాడారు. తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివన్నారు. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఇది అని అన్నారు. 

LIVE: Hon’ble CM Sri A. Revanth Reddy participates in the Inauguration of the Newly Constructed Hostels & Lays Foundation Stones for Various Buildings at Osmania University

LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Inaugurates the Newly Constructed Hostels and Lays Foundation Stones for Various Buildings at Osmania University ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ లో నూతన హాస్టల్ భవనాలను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు

Posted by Telangana CMO on Sunday, August 24, 2025

దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు ఈ యూనివర్సిటీ విద్యార్థులేనన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి కూడా ఈ యూనివర్సిటీ విద్యార్థేనన్నారు. తెలంగాణ నలుమూలలా ఏ సమస్య వచ్చినా మొదట చర్చ జరిగేది ఈ యూనివర్సిటీలోనేనన్నారు. చదువుతో పాటు పోరాటాన్ని నేర్పించే గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థేనని గుర్తు చేశారు. ఇంకా యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర సాధనలో సమిధలయ్యారన్నారు.

Also Read :  హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

గత పదేళ్లలో ఓయూను నిర్వీర్యం చేసే కుట్ర..

గత పదేళ్ల పాలనలో ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని తాము ఆలోచన చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించామన్నారు. చదువుకుని చైతన్యం ఉన్న వారిని వీసీలుగా నియమించామన్నారు. తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచే మేధా సంపత్తిని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆశిస్తున్నామన్నారు. దేశానికి యువ నాయకత్వం అవసరమన్నారు. దేశంలో 60 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారేనని.. ఇది మన దేశ సంపద అని అన్నారు. 21 ఏళ్ల వయస్సులో IAS లు దేశానికి సేవలందిస్తున్నప్పుడు…. 21 ఏళ్ల యువకులు శాసన సభలో ఎందుకు అడుగుపెట్టకూడదు? అని ప్రశ్నించారు. 

చదువు, చైతన్యం ఉంటేనే సమాజంలో రాణిస్తారన్నారు. తన దగ్గర పంచడానికి భూములు లేవు, ఖజానా లేదని అన్నారు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటేనని అన్నారు. మీ తలరాతలు మార్చేది చదువొక్కటేనన్నారు. చదువు ఒక్కటే మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుందని.. గుణవంతులను చేస్తుందని అన్నారు. పేదరికం తమకు కొత్త కాదని.. ఆ పేదరికాన్ని చూసి వచ్చినవాళ్లం తామని అన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి అధ్యయనానికి ఇంజనీర్స్ కమిటీ వేయాలని అధికారులను ఆదేశిస్తున్నానన్నారు. ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్ ఫర్డ్, ఆక్స్ ఫర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రకు నిలువెత్తు సాక్షిగా నిలవాలని ఆకాంక్షించారు. ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి ఏం కావాలో అడగండి.. అంచనాలు తయారు చేసి ఇవ్వండి..అని అధికారులకు సూచించారు.  మళ్లీ యూనివర్సిటీకి వస్తానన్నారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద మీటింగ్ పెట్టి నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. పోలీసులకు తాను ఆదేశిస్తున్నానని.. ఆ రోజు ఒక్క యూనివర్సిటీలో ఒక్క పోలీస్ కనిపించొద్దన్నారు. నిరసన తెలిపే వారిని నిరసన తెలపనివ్వండని సూచించారు. తాను రావొద్దని అడ్డుకునే వారికి సమాధానం చెప్పే చిత్తశుద్ధి తనకుందన్నారు. 

Also Read :  రేషన్ లబ్దిదారులకు అలర్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisment
తాజా కథనాలు