Telangana: రేషన్ లబ్దిదారులకు అలర్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో రేవంత్ సర్కార్ జూన్‌లో 3 నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి రేషన్ లబ్ధిదారులకు ఇచ్చేసింది. దీంతో జూన్‌తో పాటు జులై, ఆగస్టు నెలలకు కూడా రేషన్ బియ్యం ఇచ్చినట్లే.సెప్టెంబర్ నుంచి పాత, కొత్త రేషన్ కార్డులు ఉన్నవాళ్లందరికీ సన్నబియ్యం ఇవ్వాల్సి ఉంటుంది.

New Update
Fine Rice

Fine Rice

తెలంగాణలో రేవంత్ సర్కార్ జూన్‌లో 3 నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి రేషన్ లబ్ధిదారులకు ఇచ్చేసింది. దీంతో జూన్‌తో పాటు జులై, ఆగస్టు నెలలకు కూడా రేషన్ బియ్యం ఇచ్చినట్లే. మరికొన్ని రోజుల్లో సెప్టెంబర్ నెల వస్తోంది. దీంతో ఆ నెల నుంచి పాత రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులు ఉన్నవాళ్లందరికీ సన్నబియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో లబ్దిదారులందరికి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు మొత్తం 19,7621.368 టన్నుల బియ్యాన్ని మండల స్టాక్‌ పాయింట్లకు పంపించేశారు. 

Also Read: గణేశ్‌ మండపాన్ని పెడుతున్నారా ? ఈ రూల్స్‌ తప్పకుండా పాటించాల్సిందే

ఇదిలాఉండగా రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి 26 తర్వాత ఇప్పటిదాకా 4,92,395 కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో కొత్తగా 15 లక్షల మంది లబ్ధిదారులు కూడా పెరిగిపోయారు. దీనివల్ల బియ్యం పంపిణీ కూడా పెంచాల్సి పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ప్రభుత్వం దొడ్డు బియ్యం మాత్రమే ఇచ్చేది. బియ్యం సరఫరాపై భారం కూడా తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడం వల్ల, రేషన్ కార్డులు కొత్తగా జారీ చేసి ఎక్కువ మందికి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి భారం పెరిగింది. 

Also Read: మిస్టరీ ఆలయం.. ఇందులోకి వెళ్తే మాట్లాడరు.. చూడరు.. ఇంతకీ ఎక్కడంటే?

అంతేకాదు ఈ సన్నబియ్యం చాలా ఖరీదైనవి. అందుకే బియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూసేందుకు డైనమిక్ కీ రిజిస్టర్‌ను ఏర్పాటు చేశారు. కొత్తరేషన్ కార్డు తీసుకున్న చాలామందికి ఇప్పటిదాకా సన్నబియ్యం రాలేదు. దీనిపై కూడా ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అయితే వాళ్లు సెప్టెంబర్‌ 1 నుంచి రేషన్ షాప్‌లకు వెళ్లి, కొత్త రేషన్ కార్డులు చూపించి సన్నబియ్యం తీసుకోవాల్సి ఉంటుంది.   

Also Read: ముంచుకొస్తున్న భారీ వర్షాలు.. మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు కానున్నట్లు తెలుస్తోంది.సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ తొలివారంలోనే నోటిఫికేషన్ విడుదల చేసి.. నెలఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 29న కేబినెట్ మీటింగ్‌ నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు